హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొన్ని కీలక ఆరోపణలు చేస్తుంది. బిజెపి నేతలు కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరని ఎన్నికల సంఘం అధికారుల వైఖరిని తప్పుబడుతున్నారు. సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు. పాకిస్థాన్ లో ఉండేదో...భారత్ లో ఉండేదో అంటూ అనుమానం వ్యక్తం చేసారు. పోలీస్ యాక్షన్ పేరుతో భారత సైన్యాన్ని పంపించాడు అని అన్నారు. తెలంగాణ లో సర్దార్ నీ పట్టించుకోవడం లేదు అని ఆయన ఆరోపించారు.

ఎవర్ని మోసం చేయాలి అనే ఆలోచనా తప్పా..సీఎం కి జయంతి ,వర్ధంతి లు గుర్తుకు ఉండవు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కి నిజాం గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. వల్లభాయి పటేల్ ఆనాడు చేసిన కృషి తోనే ఇవ్వాళ కెసిఆర్ సీఎం అయ్యిండు అని ఆయన వెల్లడించారు. లేకుంటే చంద్రశేఖర్ రావు కాస్త ఇవ్వాళ చాంద్ పాషా అయి ఉండేది అని అన్నారు. నిజాం నిరంకుశ పాలన అని చెప్పి ఇవ్వాళ కేసీఆర్ నిజాం విధానాలకు మొకరిల్లాడు అని ఆయన మండిపడ్డారు. వీరుల చరిత్ర కనుమరుగు చేసే కుట్ర కేసీఆర్ చేస్తున్నారు అని విమర్శించారు.

కేసీఆర్ కుటుంబ చరిత్ర మాత్రమే ఉండాలని ప్లాన్ చేసారని ఆయన ఆరోపించారు. హుజూరాబాద్ లో 6 వేలు పంచి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అని మండిపడ్డారు. ప్రజలు తల దించుకునే విధంగా డబ్బులు పంపిణీ చేసారని అన్నారు. సర్వేలు అన్ని మా వైపే ఉన్నాయి అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. సీఎం పర్యవేక్షణ లోనే హుజూరాబాద్ లో దొంగాట అని మండిపడ్డారు. వివి ప్యాట్ లు పని చేయలేదని ఎలా బయటకు తెచ్చారు అని బండి సంజయ్ ప్రశ్నించారు. పని చేయడం లేదని ఎలా నిర్దారించారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈవిఏం లు మార్చారని అనుమానాలు వస్తున్నాయి అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts