నేడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖలో ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడంపై నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్ళాడు. అలాగే ఎప్పటి నుండో ఉద్యమం చేస్తున్న ఉక్కు పరిశ్రమ ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు కూడా వెళ్తున్నారు. ఉద్యమ ప్రాంతానికి చేరుకోగానే ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు పవన్. అనంతరం ఆయన పరిశ్రమ గురించి ప్రస్తావించారు. పరిశ్రమకు సొంత ఘనులు కేంద్రం ఎందుకు కేటాయించదు. దానివెనుక కారణాలు ఏమిటి అనేది నాకు ఇప్పటికి అర్ధం కావడం లేదు అన్నారు పవన్. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్లకు పదవులు తప్ప మరొకటి అవసరం లేదు. అలాగే రాష్ట్రంలో ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఇంతవరకు సొంత ఘనులు సాధించలేకపోయారు.

ఇంకా పవన్ మాట్లాడుతూ, నేను ఓడిపోయాను, అయినా పోరాటాలు చేస్తున్నాను. కానీ ఇక్కడ ఇంతమంది గెలిచినా ఏ ఒక్కరు సరైన పరిష్కారం చేయలేకపోయారు. పటేల్ వర్ధంతి సందర్భంగా అందరు ఉక్కు సంకల్పం తీసుకుని దీనిని కాపాడుకోవాలి. ఇది అన్ని పార్టీలు ఏకమై చేస్తేనే కుదురుతుంది. ఏ ఒక్కరి వల్లనో కాదు. ఇక్కడ ఉన్న దౌర్బాగ్యం ఏమంటే ఇక్కడ అందరికి మనకులం, మన వర్గం అనే పిచ్చి ఉంటుంది. అందరు ఒక్కటే అనే భావం తక్కువ అందుకే ఇక్కడ తరాలు నష్టపోతున్నాయి. ఇక్కడ ఉద్యమం ఎందుకు జరుగుతుందో కేంద్రానికి తెలియాల్సి ఉంది, అప్పుడే వాళ్లకు పరిస్థితి అర్ధం అవుతుంది. అప్పుడు ఏదైనా చేయడానికి ఉంటుంది. అందుకే వైసీపీ ఎంపీలు తగిన విధంగా ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంది. వాళ్ళు చేయలేకపోతున్నారు కనుకనే నాలాంటి వాళ్ళు రావాల్సి వస్తుంది.  

దేశంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, వాటన్నిటికీ కేంద్రం తగిన గనులను కేటాయించింది. కానీ దీనికి మాత్రం కేటాయించలేదు. కొన్ని చోట్ల మిగులు ఖనిజం ఉన్నప్పటికీ దానిని కూడా ఏపీ ఎంపీలు తెచుకోలేకపోయారు. అదైనా ఉంటె కాస్త ఉపయోగం ఉండేది. కేంద్రాన్ని వీళ్ళందరూ అడగక పోగా మాలాంటి వాళ్ళు పనులన్నీ ఆపుకొని ఇలా నిరసనలు చేయాల్సి వస్తుంది అన్నారు పవన్. ఒక్కసారి పవన్ నుండి పక్కకు వస్తే, బీజేపీ తో పూసుకు తిరుగుతున్నా విశాఖ ఉక్కుకు ఏమి మేలు చేశాడో ఆయన చెప్పలేకపోయాడు. ఎవరు ఎవరు ఎంత ఉద్యమం చేపట్టింది అందరికి తెలిసిందే. ఈ ఉద్యమం ఒకటి జరుగుతుందని ఢిల్లీ వెళ్లి కూడా ఉద్యోగులు నిరసనలు కొనసాగించారు. ఎన్ని చేసినా ప్రైవేటీకరణ ఆగదని కేంద్రం కూడా స్పష్టం చేసేసింది. ఈ విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు, కానీ ఎవరి రాజకీయస్వార్థం వారిది.

మరింత సమాచారం తెలుసుకోండి: