కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. 90వేల 550ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ఘన విజయం సాధించారు. వైసీపీకి మొత్తం లక్షా 12వేల 188ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి సురేశ్ కు 21వేల 638ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 6వేల 223 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో 2019లో గెలిచిన దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యకు 44వేల 734ఓట్ల మెజార్టీ రాగా.. ఇప్పుడు ఆయన భార్య ఆ మెజార్టీని దాటేసి విజయం సాధించారు.

బద్వేలు ఉపఎన్నిక ఫలితంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందన్నారు. ఈ గెలుపు ప్రజా ప్రభుత్వానికి.. సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన దీవెనలుగా వర్ణించారు. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

బద్వేలులో వైసీపీ గెలుపు ప్రజా విజయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ ఉపఎన్నికలో పోటీ చేసింది బీజేపీ అయినా.. తెరవెనక కథ నడిపించింది చంద్రబాబే అని తెలిపారు. బీజేపీ, టీడీపీ ప్రజల విశ్వాసం కోల్పోయారని చెప్పారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారు. బద్వేల్ ఫలితం ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందని తెలిపారు.

మొత్తాని బద్వేల్ ఉపఎన్నిక వైసీపీలో జోష్ నింపింది. ఈ గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేలులో ఉపఎన్నిక అనివార్యమైంది. టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ, కాంగ్రెస్ లు ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఉపఎన్నిక నిర్వహించాల్సి5 వచ్చింది. వెంకటసుబ్బయ్య సతీమణి సుధ వైసీపీ నుంచి బరిలో నిలవగా.. బీజేపీ, కాంగ్రెస్ లు పోటీ చేశాయి. అక్టోబర్ 30న ఉపఎన్నిక జరుగగా.. నేడు ఫలితాలు విడదలయ్యాయి. వైసీపీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించింది.







మరింత సమాచారం తెలుసుకోండి: