శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కకుమార్ హఠాన్మరణంతో కన్నడ ప్రజలు తీవ్ర దిగ్భాంత్రికి లోనయ్యారు. ఇక పవర్ స్టార్ అభిమానులు అయితే గుండెలు పగిలేలా ఏడ్చేశారు. శాండిల్ వుడ్ అయితే... ఇప్పటికీ కోలుకోలేదు. మూడు రోజుల పాటు సంతాప దినాలు కూడా ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. పునీత్ రాజ్‌‌కుమార్ హఠాన్మరణంతో ప్రస్తుతం జీమ్‌లపై అందరి దృష్టి మళ్లింది. అసలు జిమ్‌లలో సెలబ్రెటీలు ఏం చేస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో గంటలు గంటలు జిమ్‌లలో కసరత్తులపై అందరూ ప్రశ్నించుకుంటున్నారు. పునీత్ రాజ్‌కుమార్ మృతితో జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లపై దృష్టి సారించింది కర్ణాటక ప్రభుత్వం. జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ వెల్లడించారు. అతిగా వర్కవుట్లు చేయడం వల్లే 46 ఏళ్ల వయస్సులోనే పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతితో జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ వైద్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. కార్డియాలజిస్టుల నుంచి వివరాలు సేకరించింది. జిమ్‌లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఓ గైడ్ లైన్స్ జాబితాను రూపొందించినట్లు మంత్రి సుధాకర్ తెలిపారు. ఇప్పటికే ప్రముఖ గుండె వైద్యులు డాక్టర్ వివేక్, డాక్టర్ మంజునాథ, డాక్టర్ దేవి షెట్టి, డాక్టర్ రంగధామలతో కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేసింది కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ప్రతి ఫిట్ నెస్ సెంటర్‌లో కూడా ఓ ఫిజిషియన్ తప్పని సరిగా ఉండాలని వైద్యుల బృందం సూచించింది. అలాగే అత్యవసర వైద్య సహాయం కోసం తప్పని సరిగా కొన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని కూడా వెల్లడించింది. అలాగే గుండె జబ్బులు ఉన్న వారు, గుండె సంబంధిత చికిత్సలు తీసుకున్న వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇక హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు ఎక్కువ మోతాదులో కసరత్తు చేయకుండా చూడాలని కూడా ప్రభుత్వానికి వైద్యుల బృందం నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫిట్‌నెస్ సెంటర్లు, జిమ్‌లకు కూడా కీలక ఉత్తర్వులు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gym