నిన్న జరిగిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ లో బిజెపి అభ్యర్థి మరియు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అఖండ విజయం సాధించారన్న విషయం మనందరికీ విధితమే. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సమీప టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఏకంగా ఇరవై మూడు వేలకు పైగా ఓట్ల తేడాతో అద్భుత విజయం సాధించారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని రీతిలో షాక్ తగిలింది. అయితే ఇలాంటి తరుణంలో హుజరాబాద్ నియోజకవర్గం లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ పై అందరూ దృష్టి సారించారు. 

పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా ఓడిపోవడం ఇదే కావడం గమనార్హం. దీంతో రేవంత్ రెడ్డి పై మరియు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టిఆర్ఎస్ యువ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు కావడం వల్లనే మాజీ మంత్రి ఈటల రాజేందర్  గెలుపు పొందారని సంచలన వ్యాఖ్యలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 25 కోట్లకు అమ్ముడుపోయారని అందువల్లే బిజెపి పార్టీ గెలిచిందని ఆరోపణలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని.. అందుకే కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని హుజురాబాద్ బరిలో దించ లేదని మండిపడ్డారు. అందుకే టిఆర్ఎస్ పార్టీ ఓట్లు హుజరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో చీలిపోయాయనీ... పేర్కొన్నారు టిఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు పాడి కౌశిక్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: