తెలంగాణ లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ కు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా తెలంగాణ రాజకీయాలను ఎంతో హీటెక్కించిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అధ్బుతమైన విజయం సాధించింది. బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ ఘ‌న‌ విజయం సాధించారు. దీంతో బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని మ‌రో అసెంబ్లీ నియోజకవర్గానికి సైతం త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌రుగుతుం దా ? అంటే బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అవుననే అంటున్నారు.

త్వరలోనే సిరిసిల్ల జిల్లా లోని వేములవాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గా నికి ఉప ఎన్నిక వస్తుందని దుబ్బాక బీజేపీ ఎమ్మె ల్యే రఘునందన్ రావు జోస్యం చెప్పారు. వేములవాడ లో టిఆర్ఎస్ నుంచి నాలుగు సార్లు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం పై సుదీర్ఘ కాలంగా కోర్టు లో విచారణ కొనసాగుతోంది. ఆయన పౌర స‌త్వంపై ఇంకా ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.

భారత పౌరసత్వం లేకుండా ఎమ్మెల్యే గా ఉండే అర్హత రమేష్ బాబుకు లేదన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి ఉన్నాయి. అయితే ఈ కేసులో రమేష్ బాబు కు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన శాసనసభ్య‌త్వం రద్దు అవుతుంది. అప్పుడు ఆరు నెలల్లో అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జ‌రుగుతుంది. అయితే ఇది టీఆర్ ఎస్ కంచుకోట అయినా ఇప్పుడు అక్క‌డ ఆ పార్టీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. పైగా ఇది కూడా ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా లో ఉంది. మ‌రి ఈ సారి కూడా కేసీఆర్ కు టెన్ష‌న్ త‌ప్పేలా లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: