రాను రాను దేశంలో సైబర్ నేరాగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఆన్లైన్ మోసాల మాయలో పడి చాలా మంది ప్రజలు మొసపోయారు. ఎంతో కష్టపడి రూపాయి రూపాయి  సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు.  ఒకప్పుడు అమాయక ప్రజలను టార్గెట్ గా చేసుకుని రెచ్చిపోయిన ఈ సైబర్ నేరగాళ్లు..  ఇప్పుడు ఇది ఉన్నత స్థాయి మోసంగా మార్చుకున్నారు.  సామాన్య ప్రజలే కాదు..పోలీసులు, బడా సెలబ్రీటీస్,ప్రజా ప్రతినిధులనే తేడాలు లేకుండా ఎంతోమంది సైబర్ కేటుగాళ్లకు బలైపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక ఈ  సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతుల్లో అమాయకపు జనాల నుంచి డబ్బు, అలాగే తమ పరసనల్ డేటా కాజేస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా  క్రెడిట్ కార్డుల పేరుతో సైబర్ నేరగాళ్లు అలాంటి మోసాలు ఎక్కువగా  పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సైబర్‌ నేరాగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలతో ప్రజలను మాయచేసి దోపిడీకి పాల్పడుతున్న తరుణంలో ..ఈ నేరగాళ్లను అదుపు చేయడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. బ్యాంకు ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, విద్యార్థులు.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి రంగం వారిని టార్గెట్ చేస్తున్నరు ఈ మోసగాళ్లు.

ఇక సైబర్‌ నేరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి అని ఎన్ని సార్లు చెప్పుతున్న ఎక్కడొ ఒక్క చోట ఇలాంటి మోసాగాళ్ల బుట్టలో పడుతున్నారు అమాయకపు ప్రజలు. అంతేనా సోషల్‌ మీడియా మన జీవితంలో ఓ భాగంగా మారిపోతున్న క్రమంలో.. సైబర్‌ నేరగాళ్లు ఈ అకౌంట్లనే రెగ్యులర్‌ టార్గెట్‌ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అకౌంట్ల భద్రత కోసం గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ను అమల్లోకి తీసుకురావళ్లని నిర్ణయించింది.

ఇక దీని ప్రకారం మనం జీ మెయిల్‌ ఓపెన్‌ చేయాలంటే ఖచ్చితంగా పాస్‌వర్డ్‌ తో పాటు పాటు మరో అథెంటీకేషన్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు బిజినెస్‌ మెయిల్స్‌లోకి ఎంటర్ అయ్యి వ్యక్తిగత సమాచారాని దొంగలిస్తున్న  క్రమంలో యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు గూగుల్‌ సంస్థ వెల్లడించింది. నవంబర్‌ 8 నుంచి ఎంపిక చేసిన యూజర్లను ఈ టూ స్టెప్‌ వెరిఫికేషన్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: