అమెరికా మరోసారి ఇరాన్ కు హెచ్చరికలు జారీచేసింది. అయితే ఈసారి పరోక్షంగా బి1బి బాంబర్లను పరీక్షించడం ద్వారా ఈ హెచ్చరికలు చేసింది. పశ్చిమ ఆసియా మీదుగా అమెరికా ఈ బాంబర్లను ప్రయోగించింది. అయితే తాను ప్రయోగించినట్టు స్వయంగా ప్రకటించుకునే వరకు ఎవరికీ తెలియకపోవడం విశేషం. అందుకే తానే బాహాటంగా చెప్పుకోవడం ద్వారా ఆయా దేశాలకు హెచ్చరికలు జారీచేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే వేడి మీద ఉన్న అనేక దేశాలు ఆ స్థితి నుండి కాస్త వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ప్రత్యక్షంగా ఎవరు ముందుకు రావడానికి సిద్దపడటంలేదు అనేది చూస్తూనే ఉన్నాం. అందరు తమ తమ క్షిపణులను పరీక్షించడం ద్వారా తమ పైకి వస్తున్న దేశాలకు పరోక్షంగా తాము బలవంతులమే అని చెప్పకనే చెపుతున్నాయి.

తాజాగా ఇరాన్ విషయంలో అమెరికా కూడా అదే చేసింది. ఒకసారి తగ్గింది కదా అని తనను తక్కువ అంచనా వేయడం తప్పని మరోసారి ఈ బాంబర్ల పరీక్ష ద్వారా ఇతర దేశాలకు స్పష్టం చేసినట్టుగా ఉంది అమెరికా. అందరు శాంతిని కోరుకుంటున్నప్పటికీ కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం ఉన్న ప్రశాంతతకు భంగం కలిగించడానికి సిద్ధం అవుతుండటంతో ఇటీవల ఇలాంటి క్షిపణి ప్రయోగాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. దీని ద్వారా ఒకరిని మించి ఒకరి ఆయుధాలు ఉన్నాయంటూ చూపించుకోవడం వీలవుతుంది, తమ శత్రుదేశాలను తమ బలం కూడా తెలియజేసినట్టు ఉంటుంది. అంటే ఇది కూడా పరోక్షంగా హెచ్చరించుకున్నట్టే ఉంది.

కరోనా సమయంలో అందరి మధ్య శాంతి, సామరస్యం పెరగాల్సింది పోయి, ఆర్థిక సహా పలు సంక్షోభాలు తలెత్తడంతో చాలా దేశాలు దీన స్థితికి వచ్చేశాయి.  ఈ స్థితిలో కూడా ఆయుధాలతో కుస్తీ పడుతున్నాయి కొన్ని దేశాలు. ఆ పుణ్యమే మయన్మార్ కావచ్చు, ఆఫ్ఘన్ కావచ్చు, మరోదేశం కావచ్చు. ఈ దేశాల అన్నిటిలో కరోనా సహా ఇతర బాధలు కూడా తయారయ్యాయి. ఒక్క కరోనా తో నే అల్లాడి పోతుంటే, కేవలం కొందరి వలన ఆయా దేశాలలో ప్రజలు పిల్లలు సహా నరకం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు సంయమనం పాటిస్తూ ఆయా దేశాలలో శాంతి నెలకొల్పే బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. ఆయుధాల లేదా క్షిపణుల ప్రయోగం వలన వచ్చిన శాంతి కంటే, నలుగురిని బ్రతికించడం వలన వచ్చే శాంతి గొప్ప అనుభూతిని మిగులుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: