హుజూరాబాద్ లో ఘోర వైఫల్యంపై ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. యువ నాయకుడు వెంకట్ కష్టపడి పోటీ చేశారనీ.. హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత తనదేనని అన్నారు. కార్యకర్తలు నిరాశకు లోను కావొద్దన్నారు. భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజా సమస్యలపై కొట్లాడుదామని పిలుపునిచ్చారు. ఈ ఉపఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిందని.. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్ణయించలేదని రేవంత్ స్పష్టం చేశారు.

ఇక నవంబర్ 1వ తేదీన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గాంధీ భవన్ లో ప్రారంభించారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 30లక్షల మందికి డిజిటల్ సభ్యత్వం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. పార్టీ సభ్యత్వం తీసున్న సభ్యులకు 2లక్షల రూపాయల బీమా లభించనుంది. ఈ నెల 14 నుంచి 21వరకు జనజాగరణ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తామని రేవంత్ చెప్పారు. డిసెంబర్ 9న సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభకు రాహుల్ గాంధీ వస్తారని తెలిపారు.

ఇక హుజూరాబాద్ గెలుపు బీజేపీది కాదు.. ఈటలది అని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఉపఎన్నిక కేసీఆర్, ఈటల వ్యక్తిగత గొడవ అని వ్యాఖ్యానించారు. కమిషన్లు, భూముల కోసం వారిద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పారు. అటు హుజూరాబాద్ ఫలితంపై రివ్యూ కమిటీ వేస్తామనీ.. అభిప్రాయ సేకరణ చేపడతామని తెలిపారు. ఈ నెల 14 నుంచి 21వరకు పెట్రోల్ ధరలు, రైతులు, పోడు భూముల సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మరో నేత పాదయాత్రకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఈ నెల 14నుంచి 21వరకు తెలంగాణలో ప్రజా చైతన్య యాత్ర చేయనున్నట్టు ప్రకటించారు. జాతీయ, రాష్ట్ర సమస్యలపై ప్రజలను చైతన్యపరచడం కోసం మొత్తం 2వేల 300 కిలోమీటర్ల యాత్ర చేయనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 9న కాంగ్రెస్ మండల, టౌన్ అధ్యక్షులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ముధుయాష్కీ పేర్కొన్నారు. అటు తెలంగాణ రాష్ట్ర వ్యవహార ఇంఛార్జ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. హుజూరాబాద్ లో ఓటమికి గల కారణాలను తెలుసుకుంటూనే రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పనిచేసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

















మరింత సమాచారం తెలుసుకోండి: