వైసీపీ ప్రభుత్వంలో ఏదైనా సీఎం జగన్ చెప్పినట్లే జరుగుతుంది...అందులో ఎలాంటి డౌట్ లేదు...ఇక సీఎం తర్వాత కీలక పాత్ర పోషించేది మంత్రులే. ఇక వారే జగన్ తర్వాత ప్రభుత్వాన్ని నడిపించేది. కానీ జగన్ ప్రభుత్వంలో అలాంటి పరిస్తితి ఉందా? మంత్రులకు అసలు ప్రాధాన్యత ఉందా? అంటే లేదనే సమాధానం ఎక్కువగా వస్తుంది. ఏ విషయమైన సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లోనే ఉంటుంది. ఏ శాఖకు సంబంధించిన విషయాలైనా...ఈయనే చెబుతారు. అలాగే ప్రతిపక్షాలు ఏ అంశంపై విమర్శలు చేసిన సజ్జల మాత్రమే మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతారు.

అందుకే సజ్జలని సకల శాఖ మంత్రిని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం...ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అసలు మంత్రులు ఎవరనేది ప్రజలకు తెలియడం లేదని, అంతా సజ్జల మాత్రమే కనిపిస్తున్నారని అంటున్నారు. అసలు ఎంతమంది మంత్రులు జనాలకు తెలుసని ప్రశ్నించారు. అలాగే వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారని తెలుసని, కానీ ఆ ఎంపీలు ఎవరంటే...ఎవరికి తెలియని పరిస్తితి ఉందని...ఏదో రఘురామ కృష్ణంరాజు తప్ప మిగిలిన వారు ప్రజలకు పెద్దగా తెలియదని అన్నారు.

అసలు విశాఖ ఎంపీ ఎవరు? నెల్లూరు ఎంపీ ఎవరు? అని అడిగితే ఎవరికి ఏం తెలియదని చెప్పారు. నిజానికి పవన్ చెప్పిందే కరెక్టే అని చెప్పొచ్చు. మంత్రుల్లో చాలామంది ప్రజలకు తెలియదు. ఏదో రాజకీయాలు తెలిసినవారికి కాస్త మంత్రులు ఎవరనేది అవగాహన ఉంది గానీ, మిగిలిన ప్రజలకు అసలు తెలియదనే చెప్పొచ్చు. ఎంపీల విషయం ఇంకా చెప్పాల్సిన పని లేదు. నిజానికి రాజకీయం తెలిసినవారికి కూడా వైసీపీ ఎంపీలు ఎవరనేది కరెక్ట్ గా తెలియదు. అసలు సొంత పార్లమెంట్ ప్రజలకు కూడా ఆయా ఎంపీలు సరిగ్గా తెలియదనే చెప్పొచ్చు. అంటే పవన్ చెప్పింది నిజమే అనుకోవచ్చు...అంటే వైసీపీలో మంత్రులు, ఎంపీల పరిస్తితి అలా ఉంది..ఇంకా ఎమ్మెల్యేల పరిస్తితి గురించి చెప్పాల్సిన పని లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: