టీడీపీ కూడా దాదాపు కనుమరుగు అవుతుంది. ఉన్నదే ఒక్క తెలుగు రాష్ట్రంలో, అందులో కూడా పేలవ ప్రదర్శన మాత్రమే చేస్తుంది. దీనితో రోజురోజుకు తెలుగుదేశం అనే పార్టీ దాదాపు కనుమరుగు అయ్యే పరిస్థితికి వచ్చేసింది. అయినా ఏదో ఉంది అనేది చూపించుకోవడానికే బాబోరు ప్రయత్నిస్తూ, అందులోకి సీనియర్లను లాగుతున్నాడు. వాళ్ళు ఆయనకు చెప్పలేక, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండలేక మధ్యలో నలిగిపోతున్నారు. ఇవన్నీ పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు, కానీ ఎప్పుడూ ఏదో ఒక యాగీ చేస్తూ మీడియా ముందు కనిపించడం వలన అసలు టీడీపీ అనే పార్టీ ఉన్నదని అందరికి గుర్తుకు వస్తుంది అనేది బాబోరి వాదన. కనీసం ఈసారైనా ఆయన దిగిపోతే, కొత్త నాయకత్వం వలన కాస్త ప్రశాంతంగా ఉండాలని వాళ్ళు భావించినప్పటికీ, ఈ ఒక్కసారి నేనే అంటూ వాళ్ళ నెత్తిపై బాబోరు మరో బండ వేశారు.

అంటే మరో ఐదేళ్లు దాదాపుగా ఆయనను భరించాల్సి ఉంటుంది అనేది పార్టీ లో అందరి నిరుత్సహం. అది నిజమే ఏదైనా చేసి, దానిని ప్రదర్శించుకుంటే బాగుంటుంది కానీ ప్రతి దానికి మసిపూసి మారేడు కాయ అంటూ ప్రతిసారి అదే నాటకాలు ఆడితే చూసేవాళ్ళు మాత్రమే కాదు చేసే వాళ్లకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అదే ఇప్పటి టీడీపీ సీనియర్ల పరిస్థితి. కేవలం ఆయన చెప్పింది వేదం తప్ప మరొకరి మాట వైన్ నైజం బాబోరికి లేకపోయే, అందుకే మిగిలిన వాళ్ళందరూ అంతగా ఇబ్బంది పడుతున్నారు. అసలైతే ఆయనకు తెలుసు, ఒక్కసారి ఆయన పదవి నుండి తప్పుకుంటే ఆయనను ఆయన కుక్క కూడా పట్టించుకోదని, అందుకే సీటు వదలలేక పడుతున్న తిప్పలు ఇవన్నీ.  

చూసేవాళ్లకు బాబోరి బాధ తెలుస్తుంది కానీ వాళ్ళు కూడా ఇంకా ఆయన టార్చర్ భరించే స్థితిలో లేరు అన్నది ఆ పార్టీ వర్గాల లో ఉన్నమాటే. కాకపోతే ధైర్యంగా ఎవరు ముందుకు వచ్చి చెప్పలేరు అంతే. అయినా ఐదేళ్లు ఇట్టే గడిచిపోవు, అనంతరం అయినా ఆయన తప్పుకుంటారనే నమ్మకం ఉందా, అప్పటి వరకు అసలు పార్టీ ఉంటుందా..! ఇప్పటికే ప్రాంతీయంగా ప్రజలు టీడీపీ నేతలపై ఉమ్మి  వేయడమే జరగలేదు, దాదాపు అంత పని చేస్తూనే ఉన్నారు. అలా ఉన్నాయి వాళ్ళ చేష్టలు. అందరికి నచ్చినవి, వాళ్లకు అడ్డగోలుగా కనిపిస్తున్నట్టు నటిస్తుంటే ఎన్నాళ్ళు ప్రజలు కూడా భరిస్తారు. అందుకే బాబోరు ఇక మావల్ల కాదు బాబోయ్ అంటున్నారు సీనియర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: