ఏపీలో అధికార వైసీపీ లో ఉన్న ఫైర్ బ్రాండ్‌, ఆ పార్టీ మ‌హిళా ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఇంటి పోరు పెరిగిపోతోంది. సీనియ‌ర్ న‌టి అయిన రోజా గ‌తంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా గెల‌వాల‌ని ఎంతో తాప‌త్ర‌య ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ఆమె 2004 ఎన్నిక‌ల్లో న‌గ‌రిలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆమె 2009 ఎన్నిక‌ల్లో చంద్ర‌గిరి నుంచి పోటీ చేసి మ‌రోసారి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆమె జ‌గ‌న్ వెంట ఉన్నారు. వైసీపీ లో చేరిన రోజా 2014 తో పాటు 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండు సార్లు వైసీపీ ఎమ్మెల్యే గా స్వ‌ల్ప మెజార్టీతో విజ‌యం సాధించారు. అయితే ఇప్పుడు వైసీపీలో ఆమె కు చాలా మంది శ‌త్రువులు ఉన్నారు.

ఎవ‌రో కాదు జ‌గ‌న్ కేబినెట్లో మంత్రులుగా ఉన్న వారు కూడా ఇప్పుడు మంత్రి కాని రోజాను టార్గెట్ చేస్తున్నారు. రోజా మంత్రి కాకుండానే ఆమె ను ఏదోలా టార్గెట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. మ‌రి కొంద‌రు మాత్రం రోజా నియోజ‌క‌వ‌ర్గం అయిన న‌గ‌రి రాజ‌కీయాల్లో కూడా వేలు పెట్టేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. చివ‌ర‌కు ఆమె సొంత నియోజ‌క వ‌ర్గంలో ఆమె త‌న వ‌ర్గానికి ఓ ఎంపీపీ ప‌ద‌వి ఇప్పించుకు నేందుకు కూడా పెద్ద పోరాటం చేయాల్సి వ‌చ్చింది. ఇక రోజాకు వ్య‌తిరేకంగా ఈడిగ కార్పోరేష‌న్ చైర్మ‌న్ కేజె. శాంతి భ‌ర్త కేజీ కుమార్ వ‌ర్గం బ‌లంగా ఉంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరంతా రోజాకు వ్య‌తిరేకంగానే ప‌ని చేయ‌నున్నారు. ఇక ఇప్ప‌టికే వ‌రుస గా రెండు సార్లు గెలిచిన రోజా పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ఏపీ రాజకీయాల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన వారు చాలా కొద్ది మంది నేతలు మాత్రమే. పైగా రోజాపై వ‌రుస‌గా రెండు సార్లు ఓడిపోయిన గాలి ఫ్యామిలీ పై ప్ర‌జ‌ల్లో సింప‌తీ ఉంది. మ‌రోసారి అక్క‌డ టీడీపీ నుంచి గాలి భాను ప్ర‌కాష్ నాయుడు పోటీ చేయ‌డం ఖాయ‌మైంది. ఏదేమైనా ఈ సారి న‌గ‌రిలో రోజా గెలుపు వీజీ కాదు. ఆమె సొంత పార్టీ నేత‌లే ఆమెను ఓడించేందుకు క‌సితో ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: