ఇప్ప‌టి నుంచి  కాంగ్రెస్ లో రాజ‌కీయం మ‌రోలా ఉండ‌నుంది. జగ్గిరెడ్డి లాంటి వీర భ‌క్తులు పార్టీలో ఉంటూనే త‌మ గొంతు వినిపిస్తూ వ‌స్తున్నారు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అయితే ఎప్ప‌టిక‌ప్పుడు రేవంత్ కు అడ్డంగానే ఉంటున్నారు. ఈ ద‌శ‌లో ఏం చేయాలో పాలుపోని కొంద‌రు మాత్రం రేవంత్ గెలిస్తే ఒక విధంగా, లేదంటే మ‌రో విధంగా మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను తాను తొలి నుంచి ప‌ట్టించుకోలేద‌ని చెప్పి రేవంత్  త‌ప్పించుకున్నా కూడా కేసీఆర్ కు అనుబంధంగా అక్క‌డ రాజ‌కీ యం చేశార‌న్న  అప‌వాదు అన్న‌ది పోదు.


అదేవిధంగా ఆయ‌న‌ను న‌మ్మేందుకు కూడా ఇంకొంద‌రు సిద్ధంగా లేరు అన్న‌ది కూడా సుస్ప‌ష్ట‌మే. పూర్తిగా చంద్ర‌బాబు కోవ‌ర్టుగా ఉండే రేవంత్ ను ఎలా న‌మ్మ‌గ‌లం అని తెలంగాణ వాదులు పైకి తెగేసి చెబుతున్నారు. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న ఇమేజ్ కూడా న‌మ్మ‌శ‌క్యంంగా లేని ఇమేజ్ అని కూడా అంటున్నారు. ఇవ‌న్నీ రేవంత్ కు ప‌ద‌వీ గండం ఇచ్చేందుకు కార‌ణాలు కానున్నాయి.



కాంగ్రెస్ లో రేవంత్ తుఫాను వ‌చ్చింది. వ‌చ్చిన త‌రువాత ఆగుతుందా ఆగ‌దు గాక ఆగ‌దు. ఇప్ప‌టిక‌న్నా భిన్నంగా ఉండే రాజ‌కీ యం ఒక‌టి న‌డ‌వ‌నుంది. అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌లు ఏవో ర‌చించ‌నున్నారు సీనియ‌ర్లు. రేవంత్ ను త‌ప్పించినా ఆశ్చ‌ర్య‌పోన‌వస‌రం లేదు. ఎందుకంటే పార్టీని ప‌ట్టించుకోని నాయ‌కులు, ప‌ట్టించుకునే నాయ‌కులు క‌లిసి ఇప్పుడు రేవంత్ పై ఫైర్ అవుతున్నారు. వా స్త‌వానికి కాంగ్రెస్ భాష‌కు, రేవంత్ భాష‌కు చాలా తేడా ఉంది. ఈ క్ర‌మంలో రేవంత్ వాడే భాష‌పై ఎప్ప‌టి నుంచో వ‌స్తున్న అభ్యంత‌రా లు, రేవంత్ న‌డుపుతున్న రాజ‌కీయాల‌పై ఇప్ప‌టికే సీనియ‌ర్ల‌కు ప‌లు అనుమానాలు ఉన్నాయి. ఇదే ఇవాళ చ‌ర్చ‌కు తావిస్తోంది. ముందు నుంచి రేవంత్ రాక‌నో, రేవంత్ కు ప‌ట్టం క‌ట్ట‌డాన్నో జీర్ణించుకోలేక‌పోతున్న నాయ‌కులు హుజురాబాద్ ఓట‌మిని అడ్డం పెట్టుకుని  సోనియాపై ఒత్తిడి పెంచే అవ‌కాశాలే ఎక్కువ. మొన్న‌టి వేళ రేవంత్ తో ఇంకొంద‌రు కాంగ్రెస్ కు కాకుండా టీఆర్ఎస్ కు అనుగుణంగా ప‌నిచేశార‌న్న ఆరోప‌ణ‌లు  మోస్తున్నారు. వీటిపై క్లారిఫికేష‌న్ ను ఇవ్వాల్సిన నాయ‌కులు మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇక వీటిపై కాంగ్రెస్ అధిష్టానం ఏం తేల్చ‌నుందో చూడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: