పర్యావరణం గురించి ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు చర్చ వచ్చినా ఆయా దేశాలు తప్పును ఇతర దేశాలపై నెట్టివేస్తూ ఉంటాయి. ఈ విషయం ఎప్పటి నుండో చూస్తున్నదే. ఒక స్థాయిలో భారత్ వైపు కూడా ఆయా దేశాలు వేలు చూపెడతాం చేశాయంటే అతిశయోక్తి కాదు. ప్రధాని తాజాగా ఈ విషయంపై ప్రస్తావించారు. ప్రపంచంలో 17 శాతం జనాభా ఉన్న భారత్ నుండి కాలుష్యం అవుతుంది కేవలం 5 శాతమేనని ఆయన స్పష్టం చేశారు. దానికే భారత్ పై పూర్తిగా నింద వేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని నిలదీశారు. భారత్ ఎప్పుడూ ఇతర దేశాలతో స్నేహాన్ని కోరుతుందని, అలాగని నిందలు వేయడం పరిపాటిగా చేసుకోకూడదని ఆయన అన్నారు.

అసలకైతే పర్యావరణానికి పంచవర్ష ప్రణాళికలను సూచించిందే భారత ప్రధాని మోడీ. దీనికి సంబంధించి ప్రపంచం కీలక అడుగులు వేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారనే చెప్పాలి. అలాగే ప్రపంచాన్ని సోలార్ పవర్ వదలని ప్రోత్సహించింది కూడా ఆయనే. అందువలనే ఇప్పటికైనా ఈ మాత్రం సోలార్ విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగం జరుగుతుంది. ఈ దిశగా ఆయన కృషి చేసి, ప్రపంచ పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసుకోవడం అవసరం అనే విషయాన్నీ కూడా ఆయనే ప్రతిపాదించారు. దీనిని ముందుగా ప్రారంభించింది భారత్ లోనే. భారత్ లో విజయవంతం కావడం వలననే ఇక్కడ విద్యుత్ సరఫరా దాదాపు ఆటంకాలు లేకుండా అందించబడుతుంది. సోలార్ రాకముందు పరిస్థితి మరోలా ఉండేది. ఎప్పుడు విద్యుత్ సరఫరా ఉంటుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి ఉండేది.

తెలంగాణాలో కూడా ఒకనాడు చేసిన విద్యుత్ సంస్కరణల మూలకంగానే ఇప్పుడు ఈ స్థాయిలో విద్యుత్ అందుబాటులో ఉన్నదని మోడీ గుర్తుచేశారు. అయితే ఎక్కడైనా కొత్తగా ఉత్పత్తి కాకపోయినప్పటికీ, ఇతర రాష్ట్రాల నుండి తీసుకునే సౌలబ్యాన్ని కల్పించడం వలన ఈ తరహా వినియోగం సాధ్యం అవుతుంది. అందుకు మరోకారణంగా, ఎన్నో ఏళ్ళు పట్టాల్సిన పవర్ గ్రిడ్ నిర్మాణాన్ని కూడా కేంద్రం కేవలం రెండేళ్లలో పూర్తి చేయగలిగింది కాబట్టే ఈ నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యం అవుతుంది. ఇప్పుడు సోలార్ పవర్ గ్రిడ్ ను కూడా ఇదే తరహాలో అంతర్జాతీయంగా ఏర్పాటు చేసేందుకు మోడీ శ్రీకారం చుట్టారు. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే పేరుతో ఈ వ్యవస్థ పనిచేయనుంది. కాప్ 26 క్లైమేట్ సమిట్ లో ఈ తరహా ప్రారంభం పై ఆయన ప్రకటన చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: