నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం రోజురోజుకు పెరిగిపోయింది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడో మారుమూల జరిగిన ఘటనలు కూడా క్షణాల్లో వ్యవధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలి పోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కి వచ్చే కొన్ని రకాల వార్తలు అందరినీ అవాక్కయ్యేలా చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి చిత్రవిచిత్రమైన వార్తలను చదివినప్పుడు ఇది నిజమా అబద్దమా అని నమ్మడానికి కూడా కాస్త సమయం పడుతుంది అని చెప్పాలి. ఇలాంటి ఒక వార్త ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది


 సాధారణంగా మనం మార్కెట్ కు వెళ్ళినప్పుడు కర్బూజాపండు కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. ఇక కర్బుజా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని అటు నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే మార్కెట్ కు వెళ్ళినప్పుడు కర్బుజా కిలో ధర ఎంత ఉంటుంది. మహా అయితే వంద లేదా రెండు వందల రూపాయలు ఉంటుంది. ఇక అంతకు మించి ధర ఉంది అంటే ఇక ఆ కర్బుజా కొనడానికి కూడా ఎవరూ అంతగా ఆసక్తి చూపరు అని చెప్పాలి. అయితే ఇలా మార్కెట్లో 100, 200 రూపాయలు మాత్రమే పలికె కర్బుజ ధర ఏకంగా లక్షల్లో ఉంది అంటే ఎవరైనా కొంటారా. అటువైపు కన్నెత్తి కూడా చూడరు.


 కానీ ఇక్కడ మాత్రం కర్బుజ ధర లక్షల్లో ఉంది. అయినప్పటికీ జనాలు మాత్రం కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే కర్బుజా కేజీ ధర కేవలం లక్ష రెండు లక్షలో కాదు ఏకంగా కేజీ 20 లక్షల రూపాయలు పలుకుతోంది. ఆశ్చర్యపోతున్నారు కదా జపాన్ లో కాసిన యుభారీ అనే రకం కర్బుజా కేజీ ఏకంగా 20 లక్షలు పలుకుతోంది. అయితే అంత ధర పెట్టి ఎవరు కొనుగోలు చేయలేరు కాబట్టి ఇక కొనుగోలుదారుల కోసం చిన్న చిన్న ముక్కలుగా చేసి అమ్ముతూ ఉంటారు అక్కడి వ్యాపారులు. ఆకారం రుచి వల్ల ఈ కర్బుజా కి అంత ధర వచ్చింది అని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: