తెలుగు భాష పై మరో సారి ఉప రాష్ట్రప తి వెంకయ్య నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు.. ఉ మర్ అలీషా జీవిత పయనం పుస్తకం ఆవిష్క రించారు ఉప రాష్ట్రప తి   వెంకయ్య నాయుడు. నూతన విద్యా విధా నం చట్టా న్ని అందరూ స్వాగతిం చాలి.. భాష ,భావం కలిసి ముందుకు వెళతాయ న్నారు పరిపాలన లో ప్రజల భాష వుండాలన్నారు ఉప రాష్ట్రప తి  వెంకయ్య నాయుడు. మాతృ భాష కళ్ళు లాంటివి...పరభాషా కళ్ళద్దాలు లాంటివి...విద్యా విధానంలో మాతృ భాష, మాతృదేశం, మాతృమూర్తి ప్రాధాన్యత పెరగాలన్నారు వెంకయ్య నాయుడు. సూఫీ ఆధ్యాత్మిక చింతనతత్వం  దేశంలో పెరగాల్సిన అవసరం ఉందని.. పీఠాధిపతులు,మఠాధిపతులు సామాన్య ప్రజల్లో నెలకొన్న తరతమ బేధాలు తొలగించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు  ఉప రాష్ట్రప తి  వెంకయ్య నాయుడు.

 కొందరు రాజకీయ నాయకులకు కులపిచ్చి ఉంది అనుకుంటాం... అది  తప్పు.... అది కులపిచ్చి కాదు కుర్చీ పిచ్చి అని మండిపడ్డారు వెంకయ్య నాయుడు.   వాళ్ల కుర్చీ కోసం కులాన్ని వాడుకుంటున్నారు  అంతే.. అన్న మీద తమ్ముడు... అత్త మీద మామ పోటీ చేస్తున్నారని చురకలు అంటించారు వెంకయ్య నాయుడు. చట్టసభల్లో సాంప్రదాయాలు క్రమేపీ బలహీనపడుతున్నాయి. దానివల్ల వ్యవస్థ నవ్వులపాలవుతుందని.. నవ్వులపాలైతే ప్రజల్లో విశ్వాసం పోతుంది  అప్పుడు ప్రజాస్వామ్యం పరిఢ వెళ్లదన్నారు వెంకయ్య నాయుడు.

 ఆంధ్రా, తెలంగాణ, చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఎలాంటి బాష వాడుతున్నారో చూస్తున్నాం... కొందరు మాట్లాడే మాటలు రోత అనిపిస్తుంది..రాజకీయ అంటే ఇంత రోత అనే భావన కలుగుతుందన్నారు వెంకయ్య నాయుడు. ప్రజా ప్రతినిధులను   మిగతావాళ్లు ఆదర్శంగా తీసుకుంటారని తెలిపారు వెంకయ్య నాయుడు. కాబట్టి దేశం లోని ప్రజలందరూ స్వంత భాషలలొ మాట్లాడితేనే మం చి దని సూచనలు  చే శా రు ఉప రాష్ట్రప తి వెం కయ్య నా యుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp