ప్రస్తుతం భారత రక్షణ రంగం రోజురోజుకి ఎంతో పటిష్టంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇతర దేశాలు భారత రక్షణ రంగాన్ని చూసి భయపడే విధంగా ప్రస్తుతం  బలంగా తయారైంది. అయితే అటు రక్షణరంగ ప్రణాళికలు కూడా ఎంతో వ్యూహాత్మకంగానే ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే రక్షణ రంగం ఎంతో పటిష్టంగా మారడానికి  శత్రు దేశాలతో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి ముఖ్యకారణం భారత రక్షణ సలహాదారుడు అజిత్ దోవల్ అనే చెప్పాలి. ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో అయినా సరే తన దైన వ్యూహాలతో ఎంతో సులువుగా సమస్యలను  పరిష్కరించగల దీశాలి అజిత్ దోవల్.


 భారత రక్షణకు ఎలాంటి ప్రమాదం ఏర్పడినా కూడా  అజిత్ దోవల్ రంగంలోకి ఎంతో సులువుగా సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. ఇక ఇప్పటికే ఎన్నోసార్లు ఇలా క్లిష్ట పరిస్థితుల్లో అజిత్ దోవల్ రంగంలోకి దిగి తన పదునైన వ్యూహాలను అమలు చేశాడు  అయితే ఇక భారత రక్షణరంగ సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగాడు అంటే చాలు ఇక వార్ వన్ సైడ్ అయిపోతుంది అని నమ్ముతూ ఉంటారు భారత ప్రజలు. ఇకపోతే అలాంటి అజిత్ దోవల్ ఇటీవలే హైదరాబాద్ కి రాబోతున్నారు. అదేంటి అజిత్ దోవల్ హైదరాబాద్ కి ఎందుకు వస్తున్నారు అని కంగారు పడిపోతున్నారా.


 అంత కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ లో జరిగే పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొనేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రాబోతున్నారు. 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ను ఈనెల 19వ తేదీన నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ పరేడ్ లో పాల్గొనాలి అంటూ భారత రక్షణ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ వేదికగా జరగబోయే  ఈ కార్యక్రమంలో పాల్గొన బోతున్నారు అజిత్ ధోవల్.

మరింత సమాచారం తెలుసుకోండి: