ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఎన్నికల హాడావిడి ఉన్న సంగతి తెలిసిందే.  మున్సిపాలిటీ మరియు స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో  నడుస్తోంది.  ఈ నేపథ్యంలోనే...  ఓ ఊహించని పరిణామాం చోటు చేసుకుంది. వైసిపి  పార్టీ లో కార్పోరేటర్ ఎన్నికల చిచ్చు చోటు చేసుకుంది.  6 డివిజన్ కు వైసిపి అభ్యర్థి ఎంపీకపై పార్టీ లో  వ్యతిరేకత ఎదురైంది. తూర్పు నియోజకవర్గం లోని 6 డివిజన్ కు స్దానికేతురుడు కు టికెట్ ఇచ్చారని ఆరోపణలు వెల్లు వెత్తున్నాయి. వైసిపి అభ్యర్థి గా ఆత్మకూరి నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.  

ఎమ్మెల్యే మద్దాలి గిరి టికెట్ అమ్ముకన్నాడని కర పత్రాలు కలకలం రేపుతున్నాయి. వైసిపి పార్లమెంట్ జాయింట్ సెక్రటరీ గుజ్జుల రామకృష్ణ రెడ్డి పేరు తో కర పత్రాలు కలకలం రేపాయి.  మానసిక వత్తిడి కి గురి చేసి పాదర్తి రమేష్ గాంధీ చావుకు కారణమయ్యారని... మేయర్ పదవి కోసం గాంధీ నుంచి ఎమ్మెల్యే గిరి 4 కోట్లు వసూలు చేసాడని సంచలనాత్మక మైన ఆరోపణలు వెలుగు చూడటం గమనార్హం. గాంధీ కుటుంబ సభ్యులకు కాకుండా పల్నాడు ప్రాంత వ్యక్తి కి టికెట్ అమ్ముకున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి.

మద్దాలి గిరి కు దమ్ముంటే ఈటల రాజేంద్ర లాగా రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరుతున్నారు.  దీంతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మరో సారి భగ్గు మన్నాయి.  ఇక అటు కుప్పం మున్సి పాలిటీ ఎన్నికల దృష్ట్యా...  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాసిన సంగతి తెల్సిందే.  టీడీపీ పార్టీ నాయకులపై వైసీపీ దా డు ల కు పాల్ప డు తుం దం టూ..  ఎన్ని కల సం ఘానికి ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు.






మరింత సమాచారం తెలుసుకోండి: