తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో కాస్త ఇబ్బంది పడుతుంది అనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నాయకులు ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్న వ్యవహార శైలి రేవంత్ రెడ్డి ని బాగా ఇబ్బంది పెడుతున్నారని విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి విషయంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి కొన్ని కొన్ని అంశాల్లో దూకుడుగా ముందుకు వెళుతున్నారని అలాగే సొంత నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ నాయకులకు మాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలి అంటే రేవంత్ రెడ్డి వైఖరి కచ్చితంగా మారాల్సిన అవసరం ఉందని లేకపోతే మాత్రం పార్టీ అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని కొంతమంది సీనియర్ నాయకులు వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తన సొంత నిర్ణయాలు విషయంలోనే ముందుకు వెళ్లడం కాస్త ఇబ్బందికరంగా మారడంతో కొంతమంది సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని తమ తమ జిల్లాలలో పాదయాత్ర వద్దని అంటున్నట్టు తెలుస్తోంది.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అదేవిధంగా నల్గొండ ఎంపీ reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి పాదయాత్ర వద్దని చెబుతున్నారని తమ తమ జిల్లాలో పాదయాత్ర చేయవద్దని రేవంత్ రెడ్డిని కోరుతున్నారు అని అంటున్నారు. తాము పాదయాత్ర చేస్తామని చెబుతున్నారు అని అంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి పాదయాత్ర విషయంలో పునరాలోచనలో పడిపోయారని త్వరలోనే పాదయాత్ర కు సంబంధించి ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం ఈ విషయంలో ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts