కాంగ్రెస్‌లో హుజురాబాద్ చిచ్చు రాజుకుంటోంది. ఇప్ప‌టికే పార్టీలో హుజురాబాద్ ఓటిమిపై తీవ్ర విమర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో చ‌క్రం తిప్పిన సీనియ‌ర్ కాంగ్రెస్ నేత కొక్కిరాల ప్రేమ్ సాగ‌ర్ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. 10వ తేదిలోపు రేవంత్ రెడ్డి పై నిర్ణ‌యం తీసుకోవాల‌ని లేకుంటే నేను బ‌య‌ట‌కు వెళ్లి కొత్త పార్టీ పెట్టుకోవాల్నా అంటూ పేరు కూడా ప్ర‌క‌టించేశారు. దీంతో కాంగ్రెస్‌లో ఉన్న అంత‌ర్గ‌త క‌ల‌హాల‌ను వీధిలోకి లాక్కొచ్చారు. సీనియ‌ర్లు వెనుక ఉండి కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువ‌చ్చేందుకు వేసిన ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది.


 సీనియ‌ర్ల‌ను కాద‌ని టీపీసీసీ ప‌ద‌విని రేవంత్ రెడ్డికి ఇచ్చిన‌ప్పుడే అంద‌రిలో విభేధాలు భ‌గ్గుమ‌న్నాయి. అయితే, వీరంద‌రి ల‌క్ష్యం టీపీసీసీ ప‌ద‌వి మాత్ర‌మే కానీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభం తీసుకురావ‌డం  కాద‌ని అప్పుడు అనుకున్నారు. అయితే, అంతా ఓకే అనుకున్న సంద‌ర్భంలో హుజురాబాద్‌లో పార్టీ ఘోర‌ప‌రాభ‌వాన్ని చ‌విచూడ‌డంతో ఇన్ని రోజులు సైలెంట్ మోడ్‌లో ఉన్న వాళ్లు కూడా మాట్లాడుతున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగ‌ర్ తొలిసారిగా తీరుగుబాటు జెండా ఎగుర‌వేశారు. ఇప్ప‌టికే ర‌గిలిపోతున్న సీనియ‌ర్ల‌కు ఆజ్యం పోశాడు.


 ఇప్పుడు, టీపీసీసీ ప‌ద‌వి విష‌యంలో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని లేకుంటే వేరే పార్టీ పెట్టుకుని త‌మ దారిని తాము చూసుకోమంటారా అని కీలక‌ల వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాల్లో ఏం జ‌రుగుతుంద‌ని ఆసక్తిగా మారింది. తెలంగాణ లో కొత్త పార్టీ పేరు తెలంగాణ ఇందిరా కాంగ్రెస్ అని పార్టీ పేరు కూడా ఫిక్స్ చేశారు. అలాగే, కాంగ్రెస్‌లో క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే నేత‌ల‌కు కార్య‌క‌ర్త‌ల‌కు గుర్తింపు లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు ప్రేమ్ సాగ‌ర్ రావు. అయితే, ప్రేమ్‌సాగ‌ర్ గ‌రం కావ‌డం వెనుక పార్టీ సీనియ‌ర్ నేత‌ల హ‌స్తం ఏమైనా ఉంద‌నే విష‌యంపై ఢిల్లీ అధిష్టానం ఫోక‌స్ పెట్టిన‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: