ఉగ్రమూకలకు ఒక దేశాన్ని కట్టబెట్టడంతో వాళ్ళ ఆగడాలకు అంతులేకుండా పోతుంది. తాము గెలిచినట్టు భావిస్తున్న ముష్కరులు తమ ప్రస్థానం మొదలైనట్టుగానే ప్రవర్తిస్తున్నారు. అందుకే ఇటీవల ఆయా దేశాలలో దాడులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఆఫ్ఘన్ తీవ్రవాదుల దేశంగా ముద్రపడింది కానీ, నిజానికి ఆ ముద్ర పాక్, చైనా లపై ఎప్పుడో ఉంది. అంటే ఇప్పటికి తీవ్రవాదుల దేశాలు మూడు అన్నట్టే చెప్పాలి. మూడు దేశాలను తమకు ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్న ఉగ్రమూకలు తమ రాజ్యం వచ్చేస్తుందనే ఉత్సాహంలో పెట్రేగిపోతున్నట్టే ఉంది. ఒకపక్క ఆఫ్ఘన్, పాక్ లలో రోజు బాంబుల మోత, తుపాకీ శబ్దం వినపడని రోజు ఉండటం లేదు. అక్కడ ప్రజల దుస్థితి వర్ణనాతీతం.

ఈ పరిణామాలు ఆలోచించకుండానే చైనా లాంటి దేశాలు తాలిబన్ వ్యవస్థను ప్రోత్సహించాయా అంటే, అవసరం తీరేవరకు వాళ్ళు ఆ దేశంతో వినయంగా నడుచుకుని ఉండటంతో చైనా కూడా బుట్టలో పడినట్టే ఉంది. అందుకే దానికి కూడా తెలియకుండే ఆ దేశంలోనే తీవ్రవాదులు స్థావరాలు ఏర్పాటు చేసుకోగలిగారు. ప్రస్తుతం చైనా పరిస్థితి కూడా తీవ్ర సంక్షోభంలోనే ఉంది. తాజాగా ఆహార సంక్షోభం కూడా లేవనెత్తడంతో అక్కడ ప్రజల దుస్థితి కూడా పాక్, ఆఫ్ఘన్ కంటే మెరుగ్గా ఏమీ ఉన్నట్టు అనుకోవాల్సిన పనిలేదు. అయినా సరిహద్దు దేశాలపై లేనిపోని కవ్వింపులు మాత్రం జిన్ మానుకోవడం లేదు. అధికారం కోసం ఎంతదూరం అయినా వెళ్లేందుకు సిద్ధం అంటున్న కొద్దీ ఒక్కో సమస్య జిన్ పై పడుతూనే ఉంది. కరోనా కూడా మరోసారి అక్కడ విజృంభిస్తుంది. ఇలా చైనా నిండా సమస్యలతో సతమతం అవుతూనే ఉంది.

తాజాగా ఇరాక్ ప్రధాని ఇంటిపై డ్రోన్ సాయంతో దాడులకు పాల్పడ్డారు ముష్కరులు. అయితే ఈ ప్రమాదం నుండి ముస్తఫా తప్పించుకోగలిగారు. బాగ్దాద్ లో జరిగిన ఈ ఘటనలో పలువురు స్థానికులు గాయపడ్డారు. అక్కడ జరుగుతున్న ర్యాలీ లో బాంబు పేలుడు సంభవించిందని ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులకు తామే అని ఇంకా ఎవరు ప్రకటించలేదని వారు తెలిపారు. ఈ దాడి నేపథ్యంలో ప్రముఖుల నివాసాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: