చైనాలో ఒకనాడు జనాభా పెరిగిపోకుండా అదుపుచేసేందుకు అక్కడి ప్రభుత్వం ఒక్కరే బిడ్డ అనే పాలసీ ని తెచ్చిన విషయం తెలిసిందే. ఇది సత్ఫాలితాలు ఇవ్వడంతో, అనంతరం కొన్నేళ్ల తరువాత ఇద్దరు పిల్లలకు కూడా చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది కూడా కొన్నేళ్లు కొనసాగింది. దీనితో జనాభా విస్తృతంగా అదుపుచేయబడింది. ఇక అదుపుచేయడం చాలు అనుకున్న ప్రభుత్వం ఉన్న ఆంక్షలు ఎత్తివేసింది. అప్పటి నుండి అందరు ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదే చైనాలో జనాభా అదుపు పేరుతో పెట్టిన ఆంక్షల వలన ఒక  స్థాయిలో వృద్ధుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోయింది. అందుకే మళ్ళీ యువకుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ఆయా ఆంక్షలు తొలగించింది ప్రభుత్వం.

అయితే అక్కడ ఒక ప్రాంతంలో ఇంకా ఈ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అదే జిన్జియాన్ ప్రావిన్స్ లో నిబంధనలు మాత్రం ఆంక్షల సడలింపు లేదు. కారణం అక్కడ నివసిస్తున్న వారు అందరు ఇస్లాం మతస్తులు. అందుకే చైనా ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ వారిపై జనాభా విషయమే కాదు, బాషా సహా పలు విషయాలలో అనేక ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ జనాభా విషయంలో కేవలం ఒక్కరినే కనాలని ఆంక్షలు ఉన్నాయి. అంతకు మించి ఎవరైనా కంటే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది.

ఈ తరహా ఆంక్షల కు కారణం బహుశా తాజాగా చైనాలో బయటపడిన ఉగ్రస్థావరాలు కావచ్చు లేదా తాజాగా భారీగా జరిగిన బాంబు దాడులు కావచ్చు. ఏది ఏమైనా దీనిపై అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సమాజం మాత్రం తీవ్రంగా స్పందిస్తుంది. ఇస్లాం మొత్తం అతివాదులు కారు, అందుకే అందరిని ఒకతాటిపైకి తెచ్చి చూడటం సరికాదని వారు అంటున్నారు. చైనా అంతటా లేని ఆంక్షలు ఒక్క ప్రాంతంలో మాత్రం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇంకా చైనా స్పందించలేదు. దీనిపై అతివాదులు ఏవిధంగా స్పందించనున్నారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే తీవ్రవాద సంస్థలను తమకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తూ మోసపోయిన దేశాలలో పాక్, చైనాలు ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: