తెలంగాణాలో ఆర్టీసి కష్టాల్లో ఉన్న నేపధ్యంలో ఆర్టీసి చార్జీలు పెంచాలి అనే డిమాండ్ కాస్త ఎక్కువగానే వినపడుతుంది ఆర్టీసి అధికారుల నుంచి. ఆర్టీసి చార్జీలు పెంచలేదు అంటే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు ఉంటాయని సంస్థకు ప్రస్తుతం ధరల పెంపు అనేది సంజీవని లా ఉపయోగపడుతుంది అని కొందరు అంటున్నారు. ఇక తెలంగాణా సిఎం కేసీఆర్ ఆర్టీసి ధరలను పెంచే అంశానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఆర్టీసీపై మంత్రి పువ్వాడ సమీక్ష సమావేశం నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ... ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పదు అని స్పష్టం చేశారు. చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్ కి మరోసారి ప్రతిపాదనలు పంపిస్తున్నాం అని అన్నారు. ఆర్టీసీ కి తీవ్ర నష్టాల్లో ఉన్నందున చార్జీల పెంపు జరుగుతుంది అని ఆయన స్పష్టం చేసారు.  డీజిల్ ధరలు భారీగా పెంచడం వల్ల ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి వెళ్ళింది అని ఆవేదన వ్యక్తం చేసారు. డీజిల్ పై కేవలం ఒక శాతం మాత్రమే కేంద్రం తగ్గించింది అని అన్నారు. పల్లె వెలుగు లాంటి బస్సుల పై పెద్దగా భారం ఉండదు అని స్పష్టం చేసారు.

దూరపు ప్రాంతాలకు వెళ్లే బస్సులకు చార్జీలు కొంత పెరుగుతాయి అని అన్నారు. పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్ కు 25 పైసలు పెంచామని చెప్పారు. ఎక్సప్రెస్  లు అలాగే ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచామని చెప్పారు. సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు పెంచామని చెప్పారు. మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రెండు నెలక్రితం ఆర్టీసీ చార్జీలు పెంచాలని సీఎం కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేశాం అన్నారు. ఇవాళ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎండి సజ్జన్నార్, నేను చార్జీల పెంపు పై సమావేశమయ్యాం అని తెలిపారు. అందరికి ఆమోదయోగ్యమైన చార్జీలు ఉంటాయి అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts