తెలంగాణ సీఎం కేసీఆర్‌ భారతీయ జనతా పార్టీ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నాళ్లూ తనను వ్యక్తిగతంగా తిట్టినా పెద్దగా పట్టించుకోలేదని.. కానీ ఇకపై సహించేది లేదని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లూ ఏనుగు పోతుంటే.. కుక్కలు మొరగడం సహజం అని ఊరుకున్నానని.. కానీ.. తెలంగాణ రైతులను అన్యాయం చేసేలా మాట్లాడితే సహించేది లేదన్ని హెచ్చరించారు. ఇకపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే బీజేపీ నేతల నాలుక చీరేస్తానని హెచ్చరించారు. అంతేనా.. నా మెడలు వంచడం కాదు.. మీ మెడలు విరిచేస్తానన్నారు కేసీఆర్.


ఇకపై బీజేపీపై పోరు ఉధృతం చేస్తామన్న కేసీఆర్.. ఏకంగా తానే ఇక రంగంలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. ఇకపై మీడియాకు కూడా రోజూ పండగేనంటూ సెటైర్లు విసిరారు. మొత్తం గంటన్నరకుపైగా సాగిన కేసీఆర్ ప్రసంగం ధాటిగా తీవ్రంగా సూటిగా ఉంది. అయితే.. కేసీఆర్ నాలుక చీరేస్తానని వార్నింగ్ ఇచ్చినా బీజేపీ నేతలు మాత్రం మాటల యుద్ధం ఆపలేదు. ఆపలేదు సరికదా.. ఇంకాస్త డోసు పెంచేశారు.


బీజేపీ ఎంపీ అర్వింద్ అయితే.. ఏకంగా కేసీఆర్‌ను బండబూతులు తిడుతూ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పెట్టారు. ఏకంగా సీఎం కేసీఆర్‌ను వెధవన్నర వెధవ!.. తాగుబోతు వెధవ!..
రైతుల ఆత్మహత్యలకు కారణమైన వెధవ !.. దళితున్ని ముఖ్యమంత్రి చేయకుంటే మెడలు కోసుకుంటా అన్న వెధవ!.. అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. నీ బిడ్డను ఓడగొట్టినందుకు వెధవ అన్నవా నన్ను? అని ప్రశ్నించారు. ఇందూరు ప్రజలు నీ బిడ్డకు పట్టించిన గతి కంటే దరిద్రపు గతి నీకు పట్టిస్తరు తెలంగాణా ప్రజలు..! అంటూ అరవింద్‌ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.


ఎలక్షన్లలో ఓడిపోయినానని, ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నానని కేసీఆర్ తీవ్ర నిరాశ ఉన్నారన్న అర్వింద్.. సీఆర్ sc, st చట్టం గురించి సీఎం స్థాయి మర్చిపోయి, అబద్దాలు ఆడే నీచమైన స్థాయికి దిగజారారని విమర్శించారు. తీన్మార్ మల్లన్న లొట్టపీసు మాట అన్న కేసులో అధికార బలంతో పోలీసులను అడ్డుపెట్టుకొని బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారని అర్వింద్ అన్నారు. sc st అట్రాసిటీ చట్టాన్ని బలోపేతం చేసిన పార్టీయే బీజేపీ అన్నారు అర్వింద్.


మరింత సమాచారం తెలుసుకోండి: