ఆంధ్రా సీఎం మాదిరి ప‌త్రిక‌ల్లో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు ఏమీ ఇవ్వ‌లేదు కానీ అంత‌కుమించి ఆయ‌న స్పందించారు. పెట్రో ధ‌ర‌ల పెంపు ద‌ల త‌గ్గింపు అన్న‌వి కేంద్రం నిర్ణ‌య‌మేన‌ని నిజానిజాలు అన్నీ నిగ్గు తేల్చారు. ఇదే స‌మ‌యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పెడు తున్న కిరికిరి ని వివ‌రించారు. ఓ విధంగా బీజేపీతో నేరు యుద్ధానికి తాను సిద్ధ‌మేనని చెప్పి కొత్త వివాదానికి తెర‌లేపారు. ధాన్యం కొనుగోలులో కానీ పెట్రో ధ‌ర త‌గ్గింపులో కానీ త‌న ప్ర‌భుత్వానిది త‌ప్పేమీ కాద‌ని స్ప‌ష్టం చేశాక బీజేపీని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

రాజ‌కీయం లో మ‌రో కొత్త మ‌లుపు. తెలంగాణ రాజ్యాధినేత కేసీఆర్ తీసుకున్న మ‌లుపులో భాగంగా కొన్ని ఆస‌క్తిదాయ‌క విశేషాలు వెల్లువ‌డ్డాయి. ఎప్ప‌టిలానే కేసీఆర్ త‌నదైన శైలిలో బీజేపీపై ఫైర్ అయ్యారు. త‌నదైన భాష‌లో తిట్లు తిట్టారు అన‌రాని మాట‌లు అన్నారు. రాయ‌కూడని భాష ఒక‌టి ప‌లికి మీడియాలో మ‌ళ్లీ హైలెట్ అయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట‌మిని తాను ప‌ట్టించుకోన‌ని చెప్పి, ఓట‌మిని తాము లైట్ తీసుకున్నామ‌ని చెప్పారు. అసెంబ్లీలో త‌మ‌కు చెప్పుకోద‌గ్గ సంఖ్యాబ‌లం ఉంద‌ని చెప్పి ఎప్ప‌టిలానే విప‌క్షాల విష‌య‌మై సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ ఒక‌టి ఆడారు. ఇక బీజేపీతో బంధం తెగిపోయింద‌ని చెప్ప‌డం వెనుక కార‌ణాలు ఏమ‌యి ఉంటాయో?

ముఖ్యంగా నిన్న‌టి వేళ ఢిల్లీ బీజేపీ సిల్లీ బీజేపీ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. ముఖ్య మంత్రి ఎవ‌రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నారో అంద‌రికీ అర్థం అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్ష హోదాలో ఉం టూ స్థా యి మ‌రిచి వ్యాఖ్య‌లు చేసిన వారిని ఇక ఉపేక్షించ‌బోన‌ని కూడా చెప్పారు. ఇంత‌కాలం క్ష‌మించి వ‌దిలేశాన‌ని చెప్ప‌డం వె నుక అస‌లు అర్థం ఏంటి? అంటే ఆ వ్యాఖ్య‌లు తాను ప‌ట్టించుకోలేద‌ని, ఇక‌పై ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌బోన‌ని చెప్పి క‌య్యానికి కాలు దువ్వా రు. నిన్న‌టి ప్ర‌సంగంలో కాంగ్రెస్ ఊసే ఎత్త‌లేదు. ఆ మాట‌కు వ‌స్తే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను తిట్టిన తిట్ట‌కుండా తిట్టాడు. కానీ కేసీఆర్ మాత్రం బీజేపీ బాస్ బండి సంజ‌య్ నే టార్గెట్ చేయ‌డంతో సిల్లీ బీజేపీ ఎవ‌రిది ఢిల్లీ బీజేపీ ఎవ‌రిది అన్న‌ది తేలిపోయింది. అంటే కేంద్రంతో పెద్ద‌గా ల‌డాయి త‌న‌కు లేద‌ని పెంచిన పెట్రో ధ‌ర‌లు త‌గ్గించాల్సిన బాధ్య‌త వారిదేన‌ని తేల్చేశారు. అది కూడా చాలా కోపంతో ఊగిపోతూ చెప్పారు ఆ మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: