ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం.. అని అన్నాడో మహాకవి.. అయితే నేటి రోజుల్లో ఆలోచిస్తే ఆ మహాకవి ఈ మాట ఊరికే అనలేదు అన్నది మాత్రం అర్థమవుతోంది.. ఎందుకంటే  ప్రేమ అనేది ఎంతో మధురం అయినప్పటికీ ప్రియురాలు ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ప్రియురాలి తీరులో అసలు మార్పు రావడంలేదు. అయితే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే..  భార్య మీద ప్రేమతో షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు.. ఇక ప్రియురాలు దూరమైందని దేవదాసు తాగుబోతు గా మారిపోయాడు.. ఇలా ఏ ప్రేమ కథ లో చూసుకున్నా  ప్రియురాలు కఠినంగానే ఉంటుంది ప్రియుడు బాధ పడుతూనే ఉంటాడు.


అయితే అది నిజ జీవితంలో కూడా నిజమే అన్నది అర్ధమవుతుంది. ఇటీవలి కాలం లో ప్రేమలు ఎక్కువగా బ్రేక్ అవ్వడం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా బ్రేకప్ అయిన తర్వాత ఎన్నో రోజుల పాటు అబ్బాయిలు ప్రేయసివే తలచుకుంటూ పిచ్చి వాళ్ళలా మారి పోవడం.. ఇక కెరీర్ ని పూర్తిగా నాశనం చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.  కానీ ఎంతో మంది అమ్మాయిలు మాత్రం వేరొకరిని పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇలా నేటి రోజుల్లో బ్రేకప్ కారణం గా అబ్బాయిలు ఎక్కువగా బాధ పడుతున్నారు. అయితే ఇది ఎవరు చెబుతున్న మాట కాదు.


 ఇటీవల నిర్వహించిన ఒక సర్వే చెబుతున్న నిజం. బ్రేకప్ బాధ మహిళలకంటే పురుషుల్లో ఎక్కువ ఉంటుందట. లాన్సెట్ యూనివర్సిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు నిపుణులు తెలిపారు.. బ్రేకప్ తర్వాత తరచూ ఏడవడం,బాధపడటం, పదేపదే గుర్తు చేసుకోవడం, స్నేహితులతో తన బాధను చెప్పుకోవడం లాంటివి ఎక్కువగా చేసేది మగవారేనట. అంతేకాదు బ్రేకప్ కావడానికి ప్రధాన కారణం ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను ఒకరికి ఒకరు చెప్పకపోవడం అన్న విషయం కూడా నివేదికలో వెల్లడయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sad