కృష్ణంరాజు....తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరో....ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణలతో పాటు తెలుగు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిన హీరో...ఇక కృష్ణంరాజు వారసుడుగా ప్రభాస్ ఇప్పుడు తెలుగు చిత్రసీమని ఏలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం పక్కనబెడితే కృష్ణంరాజు....రాజకీయాల్లో కూడా మంచి సక్సెస్ చూశారు. మొదట కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.

ఈ క్రమంలోనే 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి టీడీపీ చేతిలో ఓడిపోయారు. ఇక ఆ తర్వాత కృష్ణంరాజు బీజేపీలోకి వచ్చేశారు. 1998 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరుపున కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక 1999లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో సైతం కృష్ణంరాజు....బీజేపీ తరుపున నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అలాగే అప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

ఇక 2004 ఎన్నికలోచ్చేసరికి ఆయన...మళ్ళీ అక్కడే పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2009 ఎన్నికలోచ్చేసరికి కృష్ణంరాజు బీజేపీని వదిలేసి...చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరారు. అలాగే ఆ ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ బరిలో దిగారు. ఇక ఇక్కడ తన సహ నటుడు మురళీమోహన్ టీడీపీ తరుపున పోటీ చేశారు. కానీ వైఎస్సార్ గాలిలో కృష్ణంరాజు, మురళీమోహన్‌లు ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత కృష్ణంరాజు కొన్ని రోజులు రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో చేరారు. కాకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

ప్రస్తుతానికి కృష్ణంరాజు బీజేపీలోనే కొనసాగుతున్నారు....కానీ యాక్టివ్ పాలిటిక్స్‌కు దురంగా ఉంటున్నారు. రాజకీయాల వైపు రావడం లేదు. మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఆయన వయసు కూడా పై బడింది....దీంతో ఆయన మళ్ళీ రాజకీయాల్లో కనిపించడం జరగని పని అనే చెప్పొచ్చు. బీజేపీకి మద్ధతుదారుడుగా ఉంటారు గానీ, మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అనేది కష్టమే అని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp