చైనా, ఇండియా.. రెండు పొరుగు దేశాలు.. రెండు కూడా భారీ దేశాలు.. రెండు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాలు.. రెండు దేశాలకు ఎన్నో విషయాల్లో పోలికలు ఉన్నాయి.. రెండు దేశాలు దాదాపు ఒకే సమయంలో రాజకీయంగా మార్పులు చెందాయి.. కానీ.. ఇప్పుడు చైనా ప్రపంచ నెంబర్‌ వన్‌ గా ఎదిగింది. అనేక రంగాల్లో దూసుకుపోతోంది. ప్రపంచ నెంబర్‌ వన్ స్థానంలో దశాబ్దాలుగా ఉన్న అమెరికాకు సవాల్ విసురుతోంది. ప్రపంచానికే అనేక పారిశ్రామిక విషయాలలో సరఫరాదారుగా ఉంటోంది.


మరి ఇండియాకు, చైనాకు ఏంటి తేడా.. అభివృద్ధిలో ఎందుకు ఇంత బేధం.. ఇదే విషయం గురించి కేసీఆర్ కూడా ఆలోచించారట. ఈ విషయం గురించి ఆయన ఓ పి‌ట్ట కథ ద్వారా చైనా గొప్పదనాన్ని, ఇండియా వీక్‌ నెస్‌ను చెప్పేశారు. చైనా వాళ్లు పొరుగునే ఉన్న ఇండియా గురించి ఆందోళన చెందారట.. ఇండియాకు చాలా వనరులు ఉన్నాయి.. భవిష్యత్ లో ఇండియా నుంచి ఎవరైనా మంచి నాయకుడు వస్తే.. ఆ దేశం మనల్ని మించిపోతుంది.. అలా జరగకూడదంటే.. ఏం చేయాలి.. అసలు ఇండియా నుంచి మనకు వచ్చే ముప్పు ఏంటి.. అనే విషయాలు చైనా తెలుసుకోవాలనుకుందట.


ఈ విషయంపై నివేదిక ఇమ్మని ఓ అధికారికి పని అప్పగించారట.. కానీ.. ఆ అధికారి ఇండియా వచ్చి.. మూడు నెలల్లోనే నివేదిక ఇచ్చేశాడట.. ఏంటయ్యా.. అంత త్వరగా నివేదిక ఇచ్చేశావు.. ఏంటి కథ అని అడిగితే.. ఇండియా వాళ్లు మన చైనాను అధిగమించే అవకాశమే లేదని చెప్పేశాడట.. ఏంటి అంత నమ్మకం.. ఎందుకలా చెబుతున్నావు అని అడిగితే.. ఇండియాకు వెళ్లి ఓ రెండు నెలలు ఉన్నా.. ఆ దేశంలో అడుగడుగునా కుల పిచ్చి.. మత పిచ్చి.. ఇలాంటివి అనేక అవలక్షణాలు ఉన్నాయి.


కాబట్టి ఆ ఇండియా వాళ్ల కొన్ని వందల ఏళ్లయినా అలాగే ఉంటారు.. వాళ్లు చైనాను దాటి వెళ్లే ఛాన్సేలేదు అని ఆ అధికారి తేల్చి చెప్పాడట.. కేసీఆర్ చైనా గురించి, ఇండియా గురించి చెబుతూ ఈ పిట్టకథ చెప్పారు. కాస్త ఓవర్‌గా అనిపించినా ఆ చైనా అధికారి చెప్పింది నిజమే కదా..


మరింత సమాచారం తెలుసుకోండి: