బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చినా బీజేపీకి డిపాజిట్లు రాలేదు అన్నారు ఏపీ మంత్రి కొడాలి నానీ. డిపాజిట్లు రాని బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని ఆయన ఆరోపించారు. మిగిలిన రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీని పెట్రోల్ పోసి తగులబెట్టారు అని విమర్శించారు. ఇదే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో 5 రూపాయలు తగ్గించారు అని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు పెట్రోల్ ధరలు తగ్గించాలని గగ్గోలు పెడుతున్నారు అని మండిపడ్డారు.

మేము రోడ్ల అభివృద్ధి కోసం వ్యాట్ వేసింది ఒక్క రూపాయి మాత్రమే అని వ్యాఖ్యానించారు ఆయన. పెట్రోల్ పేరుతో 3లక్షల 50 వేల కోట్లు దోచుకుంటున్న జలగలు బీజేపీ నేతలు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు బుద్ది చెప్తున్నా బుద్ది రావడం లేదు.. రాష్ట్రంలో బీజేపీని ఎవరూ కాపాడలేరు అని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రెవేటికరణ చేయొద్దని పవన్ మోడీని అడగాలి అని ఆయన హితవు పలికారు. పవన్ ఇస్తున్న వార్నింగ్ లు మోడీకి ఇవ్వాలి.. జగన్ కి కాదు అన్నారు. చంద్రబాబు, పవన్ లకు మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం లేదు అని ఎద్దేవా చేసారు.

చివరికి మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ కావాలన్నా సీఎం జగన్ కావాల్సి వచ్చారు అని అఖిల పక్షం ద్వారా అయినా వాళ్ళని కలవాలని ఇద్దరూ చూస్తున్నారు అని వ్యాఖ్యలు చేసారు. రాజకీయ అవసరాల కోసం ఉన్న చంద్రబాబు, పవన్ లను కేంద్రం వద్దకి తీసుకువెళ్లే ప్రసక్తి లేదు అని స్పష్టం చేసారు. వారం కాదు.. ఏడేళ్లు డెడ్ లైన్ పెట్టుకున్నా పర్లేదు.. ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ ఆయన సవాల్ చేసారు. చంద్రబాబు అధికారంలో ఉండగా 2 రూపాయలు సర్ ఛార్జ్ ద్వారా 10 వేల కోట్లు లూటీ చేసాడు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. నాలుగున్నర ఏళ్ళు 2 రూపాయిలు వసూల్ చేసి ఓట్ల కోసం ఎన్నికల ముందు తగ్గించాడు అన్నారు. చంద్రబాబు మోసం తెలుసుకున్న ప్రజలు 2019 ఎన్నికల్లో పెట్రోల్ పోసి తగలెట్టారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. తాము వ్యాట్ తగ్గించేది లేదని మంత్రి కొడాలి నానీ స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: