పిల్ల‌లు ఆరోగ్యంగా పుట్టాల‌ని త‌ల్లి ప‌లు క‌ష్టాలు ప‌డుతుంటది. క‌డుపులో ఉన్న పిల్ల‌లు పుట్టే వ‌ర‌కు త‌ల్లిదండ్రుల్లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంటుంది. అయితే ఇలాంటి టెన్ష‌న్ మ‌ధ్య త‌ల్లిదండ్రులు, వైద్యులు ఊహించిన‌దాని కంటే ఓ బుజ్జి బాలుడు అత్యంత ఆరోగ్యంగా ఉండ‌డ‌మే కాకుండా ఏకంగా ఐదు కిలోల బ‌రువుతో పుట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచాడు.

భ‌ద్రాచ‌లంలోని  అంబేద్కర్ సెంటర్ లో ఒక ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో ఐదు కేజీల బ‌రువుతో  సోమవారం రాత్రి  మగ శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించాడు.  ప్రస్తుతం తల్లి, బిడ్డల  ఆరోగ్యం క్షేమంగానే ఉన్న‌ది.  వివరాల్లోకి వెళ్లితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామానికి చెందిన కే.శ్రావణి పురిటి నొప్పులతో బాధ‌ప‌డుతుంది.  అయితే కాన్పు కోసం భద్రాచలం అంబేద్కర్ సెంటర్ లోని శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో  కుటుంబ స‌భ్యులు చేర్పించారు.  ఆమెని పరీక్షించిన గైనకాలజిస్ట్ సూరపనేని శ్రీక్రాంతి, అనస్థీషియా వైద్య నిపుణులు డాక్టర్ అక్కినేని లోకేష్  ఆద్వర్యంలో ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు.  ఐదు కేజీల పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మిన‌చ్చింది శ్రావ‌ణి.

సోమవారం రాత్రి జన్మించిన ఈ మ‌గ‌ శిశువు సాధారణంగా ఉండాల్సిన బ‌రువు కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. తొలి  కాన్పులో కూడ  శ్రావణి బాబుకు జ‌న్మ‌నిచ్చింద‌ని, మ‌ర‌ల  రెండో కాన్పులో కూడా మరో బాబుకు జన్మనిచ్చిందని ఆసుప‌త్రి వైద్యులు వెల్లడించారు. మామూలుగా  పుట్టె శిశువులు రెండున్న కిలోల నుంచి మూడున్నర కిలోల మధ్యన ఉంటారు. కానీ శ్రావ‌ణికి పుట్టిన బాబు ఏకంగా 5 కేజీల బ‌రువున్నాడు. ఇలాంటి బ‌రువుగా ఉన్న పిల్ల‌లు చాలా అరుదుగా పుడుతుంటార‌ని వైద్యులు పేర్కొన్నారు.

 ఇటీవ‌ల నిర్మ‌ల్ జిల్లాలోని సోన్ మండ‌లం లెప్ట్ పోచంపాడుకు చెందిన నేహ అనే మ‌హిళ కూడ అయిదున్న‌ర కిలోల బ‌రువు గ‌ల మ‌గ‌శిశువుకు జ‌న్మినిచ్చిన విష‌యం తెలిసిన‌దే. కొన్నేండ్ల క్రితం హైద‌రాబాద్ న‌గ‌రంలోని నీలోఫ‌ర్ చిల్ట్ర‌న్ ఆసుప‌త్రిలో న‌వ‌జాత శిశువు 6 కేజీల బ‌రువుతో తెలంగాణ‌లో రికార్డు క్రియేట్ చేసిన‌ది. నిర్మ‌ల్ బేబీ రెండో స్థానంలో ఉంటే.. తాజాగా ఖ‌మ్మంలో పుట్టిన బాబు 5 కేజీలు ఉండ‌డం మూడో స్థానానికి చేరుకున్నాడు. మొత్తానికి తెలంగాణ‌లో అధిక‌ బ‌రువు గ‌ల శిశువులు జ‌న్మిస్తున్నార‌నే విష‌యం అర్థం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: