కేసీఆర్ కు దుబాయ్ శేఖర్ అనే పేరు ముద్దుగా ఉందన్నారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. సిఎం కేసీఆర్ లక్ష్యంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ధాన్యాన్ని కొనమని కేంద్రం రాసిన లేఖను కేసీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేసారు. విచారణ కంటే ముందే సీబీఐ వాళ్ళు కేసీఆర్ కు వ్యాక్సిన్ ఇస్తే బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. హుజురాబాద్ లో ఓట్లకు పంచిన డబ్బుపై ఇన్కం టాక్స్ దాడులు జరగొచ్చు అని ఆయన హెచ్చరించారు. బీజేపీ కాదు.. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ సిల్లీ ఫెలో అని అన్నారు ఆయన.

యువత రోడ్డెక్కబోతున్నారు. నిరుద్యోగభృతిని ఎగ్గొట్టడానికే కేంద్రంపై నింధలు వేస్తున్నారు అని అన్నారు. వీధి రౌడీ మాదిరి కేసీఆర్ వ్యాఖ్యలున్నాయని కౌంటర్  వేసారు ఎంపీ. కవితను ఓడించినప్పుడు చెరుకు, పసుపు రైతులపై కేసీఆర్ పగ పట్టాడు అని ఆయన విమర్శించారు. హుజురాబాద్ లో ఓడించినందుకు వరి రైతులపై కేసీఆర్ కక్ష సాధింపు చేస్తున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.  సంజయ్ ని ఆరు ముక్కలు చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖండి‌స్తున్నాను అని స్పష్టం చేసారు.

సంజయ్ మాటల్లో తప్పేముంది? కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ సాధిస్తానని ఉద్యమంలో కేసీఆర్ అనలేదా? అని ఈ సందర్భంగా నిలదీశారు. కేటీఆర్ పై నమ్మకం‌ కోల్పోయిన కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు. రైతులకు ఉచిత ఎరువులు ఎప్పుడిస్తాడో సీఎం చెప్పాలి  అని ఆయన కోరారు. పద్మ అవార్డులంటే దొంగ పాస్ పోస్ట్ లు ఇష్యూ చేసినట్టు కాదని కేసీఆర్ గుర్తుంచుకోవాలి అని హితవు పలికారు. అవార్డు కోసం రాష్ట్రం నుంచి  ఒక్కరి పేరును కూడా కేసీఆర్ రికమండ్ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మీ పథకాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ 2007లోనే అమలు చేశారు అని గుర్తు చేసారు. ఎనిమిదేళ్ళల్లో ఒక్కసారైనా పంట బోనస్ కేసీఆర్ ఇచ్చాడా? అని నిలదీసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts