తెలంగాణ టీపీసీసీ ప్రెసెడెంట్‌గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంతో కాంగ్రెస్‌లో కొత్త జోష్ వ‌చ్చింది. అని చెప్పాలి. కానీ, ఈ జోష్ కు ఇప్పుడు హుజురాబాద్ రూపంలో స్పీడ్ బ్రేక‌ర్ వ‌చ్చి ప‌డింద‌ని చెప్పాలి. ఇది కాస్తా రేవంత్ రెడ్డి మెడ‌కు చుట్టుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట‌మిని సాకుగా చూపి రేవంత్ రెడ్డిని దూరం చేయాల‌ని అటు సీనియ‌ర్ నాయ‌కులు భావిస్తున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీని కోసం వాళ్లు ర‌హ‌స్య స‌మావేశాలు కూడా నిర్వ‌హిస్తున్న‌ట్టు స‌మాచారం.


 మ‌రోవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట‌మికి సంబంధించిన వివ‌రాలు నివేదిక రూపంలో ఇవ్వాల‌ని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. హుజురాబాద్‌లో ఘోర ఓట‌మి పాల‌వ్వ‌డంతో పాటు క‌నీసం డిపాజిట్లు ద‌క్క‌క‌పోవ‌డంపై కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ సీరియ‌స్ అయ్యార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను అన్వేషించాల‌ని సోనియా ఆదేశాలు జారీ చేశారు. నెల‌రోజుల పాటు అధ్య‌య‌నం చేసి నివేదికను పొందు ప‌ర్చాల‌ని ఆదేశించారు.


ఈ మేర‌కు ఏఐసీసీ అధ్య‌య‌న క‌మిటీ ప‌రిశీల‌కుడిగా క‌ర్ణాట‌క సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే సంజంజియ‌న్ మంత్‌ను కూడా నియ‌మించిన‌ట్టుగా టీపీసీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ వెల్ల‌డించారు. మొత్త‌నాకి హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితంగా కాంగ్రెస్‌లో అంత‌రమ‌థనంలో ప‌డ్డ‌ట్టుగా తెలుస్తోంది. అయితే, హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమి కోసం బీజేపీ కి కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని, దీని కోసం లోపాయికారిగా క‌లిసి ప‌ని చేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.


  బీజేపీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి ప‌ని చేశార‌ని స్వ‌యంగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు మాట్లాడిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అధిష్టానం నివేదిక స‌మ‌ర్పించాల‌ని నివేదిక కోర‌డంతో హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ నాయ‌కులు ఏం చేశారు. ఏ విధంగా ప‌ని చేశారో తేలాల్సి ఉంది. మ‌రి నివేద‌క‌ను ఏమ‌ని పంపిస్తారు అనేది వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: