కొంద‌రు నాయ‌కులు రాజ‌కీయాల్లో ముందుకు సాగాలంటే వాళ్లు తీవ్రంగా శ్ర‌మించాలి కొన్ని సార్లు అదృష్టం క‌లిసి రావాల్సి ఉంటుంది కూడా. ఇదే క్ర‌మంలో పెద్ద స్థాయిలో ఉన్న నేత‌లు, నాయ‌కుల తీరు వ‌ల్ల కొంద‌రు నాయ‌కులు ప్ర‌జ‌ల్లో ఫేమ‌స్ అవుతారు. తెర‌వెనుక ఎవ‌రికి తెలియ‌కుండా ఉన్న నేత‌లు తెర‌మీద‌కు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ ఇత‌రుల మాట‌లు, తీరు వ‌ల్ల గెలిచిన వాళ్లు ఎంద‌రో ఉన్నారు. అందులో ముఖ్యంగా సీఎం కేసీఆర్ మాట‌లు, ప్ర‌వ‌ర్త‌నా తీరు వ‌ల్ల ఇప్పుడు రాజ‌కీయాల్లో కీలకంగా మారిన నేత‌లు కేసీఆర్‌కు రుణ‌పడాల్సి ఉంటుంది. 


వారిలో ముఖ్యంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌, అలాగే ఇటీవ‌ల గెలిచిన ఈట‌ల రాజేంద‌ర్ ఉన్నారు. ఈ క్ర‌మంలో గ‌తంలో టీడీపీలో రేవంత్ రెడ్డి జూనియ‌ర్ నాయ‌కుడు, మాటకారి అనే విధంగా ఉండేది. త‌రువాత కేసీఆర్ ను రేవంత్ రెడ్డి తిట్ట‌డంతో స్పందించిన కేసీఆర్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో స్పందించ‌డంతో కాంగ్రెస్‌లో చేరి పార్టీకి నాయ‌కుడిగా మారాడు. అంతే కాకుండా కేసీఆర్ కు పోటీగా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి బ‌రిలో నిలిచాడు. రేవంత్ రెడ్డి ఆ విధంగా ఎద‌గడానికి ఆ స్థాయికి తీస‌కెళ్లినందుకు కేసీఆర్ కు రుణ‌ప‌డాల్సి ఉంటుందంన్నారు.


  అలాగే, బండి సంజ‌య్ మొద‌ట‌గా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. త‌రువాత ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. దీనికి కార‌ణం కూడా కేసీఆర్ నాడు వ్య‌వ‌హ‌రించిన తీరుకు బండి సంజ‌య్ కౌంట‌ర్ ఇచ్చారు. దాంతో సింప‌తి వ‌చ్చి గెల‌వ‌గ‌లిగారు. దానికి మించి బండి సంజ‌య్‌ను బీజేపీ చీఫ్‌గా నియ‌మిస్తే రాని ప్ర‌చారం కేసీఆర్‌, కేటీఆర్ టార్గెట్ చేయ‌డంతో వ‌చ్చింది. ఇప్పుడు బండి సంజ‌య్‌ త‌నకు స‌మ ఉజ్జి అన్న రీతిలో కేసీఆర్ మాట్లాడ‌డం, విమ‌ర్శించ‌డంతో కీల‌క నేత‌గా త‌యారు అయ్యారు. ఈ మ‌ధ్య‌లో ఈట‌ల‌కు కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిన నేత‌గా కేసీఆర్ అనే చెప్పుకోవాలి. ఇన్ని రోజులు ఒక నియోజ‌క‌వ‌ర్గానికి పరిమితం అయ్యి, రాష్ట్ర మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించినా రానీ ప్ర‌చారం, ఫేమ‌స్ కేసీఆర్ వ్య‌వ‌హారం కార‌ణంగా వ‌చ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. దీనికి కేసీఆర్‌కు రుణ‌ప‌డి ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: