చోటా భీమ్ గురించి అందరికీ తెలుసు.. ముఖ్యంగా చిన్నారులకు అయితే మరింత ఎక్కువ తెలుసు.. కార్టూన్ నెట్వర్క్ లో చోట భీమ్ సీరియల్ చిన్నారులను తెగ ఆకర్షిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సీరియల్లో చోటా భీమ్ చేసే సాహసాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే నిజజీవితంలో చోట బీమ్ ఉంటాడా అంటే ఇక్కడ ఇక్కడ బుడ్డోడిని చూస్తే చోటాభీమ్ అనకుండా ఉండలేరు ఎవరు. ఎందుకంటే పుట్టుకతోనే బాల భీముడు గా మారిపోయాడు ఇక్కడొక శిశువు. సాధారణంగా డెలివరీ అయిన సమయంలో శిశువు రెండున్నర కిలోల నుంచి నాలుగు కిలోలు లోపు బరువులో పుడతారు అన్న విషయం తెలిసిందే.


 ఇక నాలుగు కిలోల కంటే ఎక్కువ బరువు పుట్టడం అంటే అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇటీవలే భద్రాచలం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇలాంటి అరుదైన ఘటన జరిగింది. నాలుగు కిలోలు కాదు ఏకంగా ఐదు కిలోల బరువు తో మగ శిశువు జన్మించాడు. వివరాల్లోకి వెళితే.. పాల్వంచ కు చెందిన శ్రావణి ఇటీవలే తొమ్మిది నెలల తర్వాత భద్రాచలం లో ఉన్న సురక్ష అనే ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఈ క్రమంలోనే వైద్యులు బృందం ఇక శ్రావణికి ఆపరేషన్ నిర్వహించి శిశువు బయటకు తీశారు. ఈ క్రమంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది శ్రావణి.


 అయితే ఇలా పుట్టిన శిశువును చూసి వైద్యులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు. ఏకంగా శిశువు 5 కిలోల బరువు ఉండటం  గమనార్హం. సహజంగా అయితే రెండున్నర కిలోల నుంచి నాలుగు కిలోల వరకు శిశువులు జన్మిస్తారని.. ఇలా ఐదు కిలోల బరువు జన్మించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అని డాక్టర్లు అంటున్నారు. ప్రతి వెయ్యి మందిలో ఒకరు మాత్రమే ఇలా అధికబరువుతో జన్మిస్తారని అంటున్నారు. ఇక ఐదు కిలోల బరువుతో జన్మించిన ఆ బుడ్డోడిని బాలభీముడు అంటూ చెబుతున్నారు వైద్యులు. కాగా ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారా అంటూ వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: