తెలంగాణ సీఎం కేసీఆర్ త్వ‌ర‌లోనే కేబినెట్లో ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే మూడు సంవ‌త్స‌రాల పాల‌న తెలంగాణ లో కేసీఆర్ పూర్తి చేసుకున్నారు. ఇప్ప‌టికే ఏడేళ్ల నుంచి అధికారంలో ఉన్న కేసీఆర్ మ‌రో సారి తెలంగాణ లో గెలిచి హ్యాట్రిక్ కొట్టి తెలంగాణ లో తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా ఆవిర్భ‌వించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. వీలు ఉంటే కేసీఆరే వ‌చ్చే ఎన్నిక‌ల కు ముందుగానే త‌న రాజ‌కీయ వార‌సుడి గా త‌న త‌న‌యుడు కేటీఆర్ ను ప్ర‌క‌టిం చేస్తార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక అంత కంటే ముందే త‌న ఎన్నిక‌ల డ్రీం కేబినెట్ ను ఏర్పాటు చేసుకుని.. ఈ కేబినెట్ తో నే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న కేబినెట్లో ఉన్న వారిలో ఇద్ద‌రు మంత్రుల‌ను పీకి ప‌డేస్తున్నార‌న్న టాక్ అ యితే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆ ఇద్ద‌రు మంత్రులు కూడా గ‌తంలో టీడీపీ లో ఉండి... ఇప్పుడు టీఆర్ ఎస్‌లో మంత్రులుగా ఉన్న వారే అని అంటున్నారు.

వారిలో ఒక‌రు గ్రేట‌ర్ హైద‌రాబాద్ కు చెందిన మ‌ల్లారెడ్డి అంటున్నారు. మ‌ల్లారెడ్డి గ‌తంలో టీడీపీ నుంంచి ఎంపీ గా గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మె ల్యేగా గెలిచారు. రెడ్డి కోటాతో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ కోటాలో ఆయ‌న మంత్రి అయ్యారు. అయితే ఆయ‌న‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆయ‌న్ను ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వి నుంచి పీకేస్తార‌ని అనుకున్నా కేసీఆర్ కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నారు.

ఇక  ఇప్పుడు మ‌రో మంత్రి వ‌రంగ‌ల్ జిల్లా కు చెందిన ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు  ... ఆయ‌న పై కూడా వేటు క‌త్తి వేలాడుతుంద‌ని టాక్ ?  ఇప్ప‌టికే కేబినెట్లో వెల‌మ సామాజిక వ‌ర్గానికి ఎక్కువ ప‌దువులు ఉన్నాయ‌ని అంటున్నారు. ఇప్పుడు ద‌యాక‌ర్ రావు బ‌దులు అదే వ‌రంగ‌ల్ జిల్లా నుంచి బీసీ ఎమ్మెల్యేల‌ను కేబినెట్లోకి తీసుకుంటార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: