తువాలు, ఇదొక చిన్న దేశం. ఇటీవల ప్రారంభమైన కాప్26 సమావేశాల సందర్భంగా ఈ చిన్న దేశంలోని వారు ఐక్యరాజ్యసమితికి ఆయా సమావేశాల సందర్భంగా కాలుష్య ప్రభావాన్ని తెలిపేందుకు వినూత్నంగా ప్రయత్నించారు. అందుకు స్వయంగా ఆ దేశంలోని మంత్రి నీళ్లలో మోకాళ్ళ లోటు దిగి అక్కడ నుండి ప్రసంగించారు. ఆయన ఈ ప్రసంగం ద్వారా వాతావరణ మార్పుల వలన కలిగే దుష్ఫలితాల గురించి ప్రస్తావించారు. ఆయన తువాలు మంత్రి సైమన్ కోఫెది. ఇలా వినూత్నంగా ప్రసంగించడం వలన ఆయన పర్యావరణ కాలుష్యంపై తనదైన శైలిలో స్పందించి అందరిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తుంది.

ప్రస్తుతం కాప్26లో కూడా ఈ వాతావరణ మార్పులపైనే చర్చలు జరుగుతున్నాయి. అందుకే ఆయన ఇలా కొత్తగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఈ సమావేశాలలో అనేక మంది దేశాది నేతలు తమ దేశం తరుపున పాల్గొన్నారు. అందులో భాగంగానే కోఫె కూడా పాల్గొన్నారు. అయితే ఆయన వీడియో ద్వారా కూడా వినూత్నంగా స్పందించాలని సముద్రంలో పోడియం పెట్టి అక్కడ మోకాళ్ళ లోతులో నించొని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఈ తరహా వీడియో రికార్డు చేసి దానిని ప్రస్తుతం జరుగుతున్న సమావేశానికి తమ దేశం తరుపున పంపారు. దానికి ఆయన ఎంచుకున్న మార్గం కొత్తగా ఉండటంతో వైరల్ అయ్యింది.

ఈ వీడియో చూడడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ, కాలుష్యం మూలంగా సముద్ర మట్టాలు త్వరగా పెరిగిపోతున్నందున కొన్నాళ్ల తరువాత సమావేశాలు ఇలానే జరుపుకోవాల్సి వస్తుంది అనే సందేశాన్ని చెప్పకనే చెప్పారు. ఇప్పటికైనా ఆయా దేశాలు దీనిపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలి ఆయన కోరారు. ఈ వీడియో తువాలు దేశంలో అధికారిక మీడియా టీవీబీసీ లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ ప్రదేశం దేశ రాజధాని ఫునాఫుటి. ఈ చిన్న దేశం వైశాల్యం కేవలం 25.9 చ.కి.మీ. అందులో కూడా 9 ద్విపాలు ఉన్నాయి. ఈ దేశంలో మొత్తం జనాభా కూడా 11792 మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: