తాలిబన్లు ఆఫ్గాన్ ను స్వాధీనం చేసుకున్న అప్పటినుండి ఆ దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. అయితే తాలిబన్లతో ఆఫ్గన్ కే కాదు దక్షిణాసియా దేశాల శాంతికి హతం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకే భారత ప్రభుత్వం దక్షిణాసియా దేశాలతో ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్  సదస్సును ఏర్పాటు చేసింది.
 అయితే ఆఫ్గాన్ లో శాంతిభద్రతల పునరుద్ధరనే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించారు. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భారత్ చాలా సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించింది.


ఇందుకు భారత్ 22500 కోట్లు ఖర్చు చేసింది. అక్కడి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు రెండు దశాబ్దాలుగా  భారత్ భారీగా నిధులు ఖర్చు చేసింది. G20 సమ్మిట్, బ్రిక్స్, ద్వైపాక్షిక చర్చల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ కీలకంగా వ్యవహారించింది. ఈ క్రమం లో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై ప్రాంతీయ చర్చల్లో రష్యా,  ఇరాన్  5 మధ్య ఆసియా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మధ్య ఆసియా దేశాలైన తజీకిస్థాన్, కిరికిస్తాన్ కజకిస్తాన్, ఉజ్బెకిస్థాన్, రష్యా ఇరాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఆఫ్ఘనిస్తాన్ విషయంపై చర్చలు జరిపారు. ఈ సమావేశాలకు భారత భద్రత సలహాదారు  అధ్యక్షత వహించారు. అయితే తాజా చర్చల్లో పాల్గొనేందుకు పాక్ నిరాకరించింది. గతంలో ఇరాక్ చర్చలు నిర్వహించిన పాకిస్తాన్ హాజరుకాలేదు. పాకిస్థాన్ బాటలోనే చైనా నడిచింది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ సదస్సుకు హాజరు కాలేదు. అయితే   భారత భద్రతా సలహాదారు అధ్యక్షతలో ఏడు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు సమావేశమయ్యారు. ఇక ఈ క్రమంలోనే అజిత్ దోవల్ ప్రారంభోపన్యాసం చేశారు.

ఆఫ్ఘనిస్థాన్లో చోటుచేసుకుంటున్న పరిణామాలన్నింటిని నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మానవతా సహాయాన్ని అందించడంతో పాటు ఆ దేశాన్ని పాలిస్తున్న తాలిబన్ల ప్రభుత్వ వైఖరిపట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అజిత్ దోవల్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి అన్ని దేశాలు కూడా తమ సరిహద్దుల్ని తెరిచి ఉంచే విషయాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించక తప్పదని పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: