రామాయణ సర్క్యూట్ రైలు మార్గంలో భద్రాచలం క్షేత్రాన్ని కలపాలని నిర్ణయించాము అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి మాట్లాడి ఆయన సూచనల మేరకు రైల్వే అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాము అని ఆయన తెలిపారు. రామాయణ సర్క్యూట్ రైలు యాత్రికులకు తగిన వసతి సదుపాయం భద్రాచలంలో ఉంది అని పేర్కొన్నారు. భద్రాచలం క్షేత్ర అభివృద్ధికి కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి నిధులు కూడా కేటాయిస్తాము అని స్పష్టం చేసారు. తిరుమల అంజనాద్రి ప్రాశస్త్యం గురించి ఏపీ ప్రభుత్వం, టీటీడీ చెబుతున్నాయి అన్నారు మంత్రి.

అంజనాద్రి పై పూజాపునస్కారాలు జరుగుతున్నాయో లేదో తెలియదు అని అన్నారు. అయితే రామాయణ సర్క్యూట్ లో అంజనాద్రి జోడించే ప్రతిపాదన ఏదీ మాకు రాలేదు అని ఆయన తెలిపారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే ఖచ్చితంగా సర్క్యూట్లో కలుపుతాము అని స్పష్టం చేసారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో కలిపే ఆలోచన కూడా ఉంది అని అన్నారు. శ్రీశైలం క్షేత్ర అభివృద్ధికి రూ. 70 కోట్లు ఇచ్చాము అని ఆయన తెలిపారు. శ్రీశైలానికి రైలు కనెక్టివిటీ లేదు అని కర్నూలు నుంచే వెళ్లాల్సి ఉంటుంది అని అన్నారు.

అలాగే జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ. 37 కోట్లు కేటాయించాము అని వివరించారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కూడా చర్చించాము అని పేర్కొన్నారు. ఆ నిధులను ఖర్చు చేస్తే, మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము అని ఆయన తెలిపారు. విదేశాల్లో ఉన్న భారత కళాసంపదను మోదీ సర్కారు వెనక్కి తీసుకు వస్తోంది అని విమర్శించారు. అమెరికా నుంచి దాదాపు 150 పురాతన విగ్రహాలను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అన్నారు. ఇప్పటికే తీసుకొచ్చిన విగ్రహాల్లో తమిళనాడుకు చెందిన 2 విగ్రహాలు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక విగ్రహం ఉన్నాయి అని పేర్కొన్నారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వంతో చర్చించి ఆ విగ్రహాన్ని అందజేస్తాము అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts