అమెరికా ఎప్పటి నుండో ఇరాన్ పై అణు ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ రెండు దేశాల మధ్య కాస్త చెడిందనే చెప్పాలి. గతంలో ఇరాన్ కోసం అమెరికా యుద్ధం చేసింది(గల్ఫ్ యుద్ధం). అప్పటి నుండి అమెరికా ఇరాన్ కు కాస్త ఒత్తిడిగానే తయారవుతూ వచ్చింది. దీనితో అణుఒప్పందాల విషయంలో ఆంక్షలు ఇరాన్ కు తప్పలేదు. అలా భరిస్తూనే వస్తుంది ఆ దేశం కూడా. సాధారణంగా అణు విపత్తుత్ తెలిసిందే కాబట్టి అది ఎక్కువగా ఉపయోగిస్తూ ఆయుధాలు చేయడం అన్ని దేశాలు మానుకోవాలని రెండో ప్రపంచ యుద్ధ అనుభవాలతో ఆయా దేశాలు తీర్మానించుకున్నాయి. అందుకే కొన్ని దేశాలపై ఆంక్షలు తప్పలేదు. అసలైతే ఆంక్షలు పెట్టిన వారు కూడా వాటిని పాటించిన వారేమి కాదు కానీ, ఇతర దేశాలు తమను మించిపోతాయనే భయంతో అలా ప్రవర్తిస్తున్నాయి.

ఇక చైనా కూడా అమెరికను దాటేయడానికి కంకణం కట్టుకుని దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకస్థాయిలో నువ్వెంత అంటే నువ్వెంత అన్న సందర్భాలు కూడా కరోనా ముందు చూశాం. దీనితో అమెరికాను ఎదిరించే దేశం ఒకటి తయారైందని దాని శత్రుదేశాల అనుకోవడంతో అవన్నీ చైనా పక్కకు చేరాయి. అలా ఇరాన్ కూడా చేరింది కానీ చైనా పెద్దగా ఆదరించలేదు, దాని అదృష్టం బాగుంది. కేవలం అప్పుగా ఇస్తాను తప్ప ఉచితంగా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది చైనా. ఒక్కసారి చైనా దగ్గర అప్పుగా తీసుకుంటే ఏమి జరుగుతుందో ఇరాన్ కు తెలిసిపోయినట్టే ఉంది. అందుకే తప్పుకుని మళ్ళీ అమెరికా పంచన చేరక తప్పలేదు, అది పెట్టె ఆంక్షలకు లొంగక తప్పలేదు.

తాజాగా మరోసారి ఈ రెండు దేశాల మధ్య చర్చలకు సందర్భం వచ్చింది. అయితే అందుకు సిద్దమే కానీ ఆంక్షల జోలికి ఫోనంటేనే అంటుంది ఇరాన్. ఆంక్షలు లేకుండా అమెరికా ఇరాన్ ను వదులుతుందా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ఆంక్షలు తప్పవు అని అమెరికా అంటే, అక్కడ చర్చల విషయం కూడా లేనట్టే అనుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: