కుప్పం ఎన్నికల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది ఏంటీ అనే దానిపై కాస్త ఆసక్తి నెలకొన్న తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కీలక కామెంట్స్ చేసారు. ఆర్వోపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని అన్నారు. సీఎంకు సామాజిక బాధ్యత కూడా లేదు అని మండిపడ్డారు. మీ రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటారా అంటూ ఆయన నిలదీశారు. తిరుపతి ఉప ఎన్నిక ఒక ఫాల్స్ ఎలక్షన్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. దొంగ ఓట్లు వేయించుకుని రిగ్గింగ్ చేశారు అన్నారు చంద్రబాబు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైనా మాఫియా లీడర్ అనుకుంటున్నాడా అని నిలదీశారు. ప్రశాంతమైన కుప్పంలో  అలజడి సృష్టిస్తున్నారు అని ఆరోపణలు చేసారు. కుప్పంలో అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు. రౌడీలను రంగంలోకి దింపి ప్రజలను  మైనింగ్ వ్యాపారస్తులను బెదిరింపులకు గురి చేస్తున్నారు అని ఆరోపణలు చేసారు. ప్రధాన ప్రతిపక్ష నేత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి ? అని నిలదీశారు. కుప్పం 14వార్డులో టీడీపీ అభ్యర్థులు బరిలో ఏకగ్రీవమని ఎలా ప్రకటించుకుంటారు అని ప్రశ్నించారు.

అర్దరాత్రి టీడీపీ నేతలను అరెస్ట్  చేస్తారా అంటూ నిలదీసిన చంద్రబాబు ఎమ్మెల్యే అన్న గౌరవం లేకుండా  రామా నాయుడుని అరెస్ట్ చేసారు అని ఆరోపించారు. 41a నోటీసులు  ఇచ్చి అక్రమంగా అరెస్టు చేయడం ఏంటి అని మండిపడ్డారు. ప్రచారం చేసుకోవడానికి వెళ్తుంటే అనుమతి లేదని అడ్డుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అరెస్ట్ చేయొద్దని కోర్టులు చెప్తున్నా అరెస్టు చేస్తున్నారు అన్నారు. నాకు కుప్పం మునిసిపాలిటీలో 10వేళ మెజార్టీ వస్తే ఇప్పుడు అక్కడి ఓటర్లను బెదిరిస్తున్నారని వ్యాఖ్యలు చేసారు. మేము అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల జోలికి రాలేదు అని స్పష్టం చేసారు.

 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఫాల్స్ అంటూ బలవంతపు ఉపసంహరణలతో అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారు అని మండిపడ్డారు. ఎంపిటిసిలు 2014లో 2శాతం ఏకగ్రీవం అయితే 2020లో  24శాతం అయ్యాయి అని వివరించారు. జెడ్పిటిసిలో 2014లో 9శాతం  అయితే,2020లో 19శాతం ఏకగ్రీవం అయ్యాయి అన్నారు. ఎన్నికలపై అక్రమాలపై న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని ఫోర్జరీ డాక్యుమెంట్లు, సంతకాలతో ఉపసంహరణలు చేస్తున్నారు అని మండిపడ్డారు. జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి 420 సీఎం అని ఆయన ఆరోపించారు. రూపాయి పెట్టుబడి లేకుండా 1265కోట్లు లబ్ది పొందారని సీబీఐ చెప్పింది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap