ఫైర్ బ్రాండ్ రోజాకు రాజకీయం కలిసి రావట్లేదన్న టాక్ ను బద్దలు కొట్టబోతున్నారట. అధికారంలోకి వస్తే అందలం ఎక్కడం ఖాయమనే లెక్కలు తప్పడం లేదని సంకేతాలు అందుతున్నాయట. మరి రాజకీయ సుడిగుండంలో ఉన్న రోజాకు ఆశించిన పదవి దక్కుతుందా? ఈసారైన అమాత్య యోగం పడుతుందా? ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈసారి కొత్త మంత్రులు రాబోతున్నారన్న చర్చ జరుగుతున్నా ఆ కొత్తవారు ఎవరన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

రెండున్నర ఏళ్ల తర్వాత మళ్లీ మంత్రుల మార్పు ఉంటుందని అప్పట్లోనే ప్రకటించడంతో ఈ పొజిషన్ లో ఉన్న వారందరూ కూడా క్లారిటీతో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రోజా ఎన్నాళ్లనుంచో మంత్రి పదవి కోసం  ఎదురు చూస్తున్నారు. తొలిసారి గురితప్పిన ఈసారి తగ్గేదేలే అన్నట్లుగా ఆమె ధీమా. త్వరలో జరగబోయే కేబినెట్లో బెర్త్ ఖాయమని ఆమె అనుచరులు ఫుల్లు కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కానీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవని మళ్లీ మారుతున్నాయన్న ప్రచారం మధ్య రోజా మరోసారి డల్ అయిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాల మధ్య ఈ సారి కూడా ఆమెకు సర్దుబాటు పోస్టేనని టాక్ వినిపిస్తోంది. దశాబ్దకాలంగా రాజకీయాల్లో ఏం చేసినా ఓ సంచలనంగా మారుతున్న రోజా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. జగన్ కోసం చేసిన పొలిటికల్ ఫైట్ లో ఆమె చాలానే లాస్ అయ్యారని చెప్పుకుంటున్నారు. ఆఖరకు ఎమ్మెల్యేగా ఉండి ఏడాదికిపైగా  అసెంబ్లీ లో అడుగు పెట్టలేకపోయారు. ప్రభుత్వం రాగానే కోల్పోయినవన్నీ తిరిగి పొందొచ్చనే ఫుల్ కాన్ఫిడెన్స్తో వాటిని లెక్క చేయకుండా ఎదురేగారు. తొలిసారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రోజాకు గతంలో ఏపీఐఎసీ పదవి ఇచ్చినట్లే ఈసారి ఆమెకు మరేదో పదవి  ఇచ్చే ఆలోచన జరుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది. టిటిడి బోర్డు లోకి ప్రవేశం ఉన్న చైర్మన్ను ఆమెకు అప్పగించడం ద్వారా డబుల్ధమాకా అవకాశం కల్పించడం ప్రోటోకాల్ ప్రకారం క్యాబినెట్ హోదా కల్పించడం అవుతుందన్నది ఓ స్కెచ్చట.

అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని కూడా కట్టబెట్టే యోచన జరుగుతోందట. ఇంటా బయట పోరాడుతూ అధికారాన్ని ఆస్వాదించలేక లావాలా రగులుతున్న ఆవేదనను దిగమింగుకొని ఆశతో ఎదురు చూస్తున్న రోజా వీటిని అంగీకరిస్తారా. గతంలో ఏపీఐఎసీ పదవినే వద్దని విసిరేసిన ఆమెను పార్టీ పెద్దలు బుజ్జగించే వరకు చేపట్టని రోజా మంత్రి పదవి లో ఈ మలుపులే జరిగితే ఎలా వ్యవహరిస్తారు అనేది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: