కేంద్రంపై సిఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటీ అనేది ఇప్పుడు ఆసక్తిగా ఉంది. సిఎం కేసీఆర్ కేంద్రాన్ని విమర్శించడాన్ని కేంద్ర పెద్దలు కూడా అంత తేలికగా తీసుకోవడం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. బిజెపి రాష్ట్ర నాయకులు కూడా సిఎం కేసీఆర్ కు గట్టిగానే సమాధానం ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక నేడు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ ఆందోళనలకు దిగుతుంది. వరి ధాన్యం కొనుగోలు పై బిజెపి వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేయాలని తెరాస నేతలు నిర్ణయం తీసుకున్నారు. సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో నిరసన చేయాలని ముందుకు వస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో కొనసాగనున్న గులాబీ సైన్యం ధర్నాలు నిరసనలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొనే విధంగా తెరాస పార్టీ నేతలు వ్యూహం సిద్దం చేసారు. మూడు లక్షల మంది గులాబీ సైన్యం రైతు సమస్యలపై ధర్నాలో పాల్గొంటారు.అని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. నిన్న బిజెపి నేడు టీఆర్ఎస్ వరుసగా పోటాపోటీ ధర్నాలు నిర్వహించడం తెలంగాణాలో హాట్ టాపిక్ అయింది. నిరసన సక్సెస్ అయ్యేలా ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

హైదరాబాదులో లో ఇందిరా పార్క్ వద్ద జంటనగరాల టిఆర్ఎస్ నేతల ఉమ్మడి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ సిద్ధిపేటలో హరీష్ రావు నిరసన  కార్యక్రమాల్లో పాల్గొంటారు అని తెలుస్తుంది. ఆయా జిల్లా ప్రధాన కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సీనియర్ నేతలు కార్యకర్తలు నాయకులు రైతులు ధర్నాలో పాల్గొంటారు అని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి ధర్నాలకు అనుమతి తీసుకున్నారు టిఆర్ఎస్ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts