ఏపీ లో అధికార వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే  తొగురు ఆర్థర్‌. ఆయ‌న చేసిన సేవ‌ల‌కే ఇప్పుడు ఆ  అరుదైన గౌరవం దక్కించుకున్నా రు.  కరోనా లాక్‌డౌన్ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ తన నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు మామూలు సేవ‌లు చేయ‌లేద‌నే చెప్పాలి. ఆయ‌న క‌రోనా ఎంత తీవ్రంగా ఉన్నా కూడా నిత్యం ప్ర‌జ‌ల తోనే ఉన్నారు.

కరోనా బాధితులను పరామర్శించడం తో పాటు వారికి ప్ర‌తి రోజూ అందు బాటులో ఉన్నారు. వారికి మాస్కుల తో పాటు శానిటైజర్లు అందేలా చేయ‌డంలో త‌న వంతు గా కృషి చేశారు. ఇక క‌రోనా రోగుల‌కు ఆసుప‌త్రు ల‌కు సిఫార్సు చేసే విష‌యం లో ఆయన ఎప్పుడూ అలెర్ట్ గానే ఉన్నారు. క‌రోనా రోగుల్లో ఎంతో మంది ఆయ‌న చేసిన సేవ‌లు, సిఫార్సుల వ‌ల్లే ప్రాణాపాయ స్థితికి వెళ్లి కూడా బ‌తికి బ‌య‌ట ప‌డ్డారు.

ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌ చేసిన కరోనా సేవలను గుర్తిస్తూ లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఎమ్మెల్యే ఆర్థర్‌ను సర్టిఫికెట్ ఆఫ్ కమిట్‌మెంట్ కు ఎంపిక చేసి అభినందించింది. త్వ‌ర‌లోనే నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన నందికొట్కూరులో త్వరలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ కు సన్మాన కార్య‌క్ర‌మం పెట్టారు.

ఈ స‌న్మాన కార్య‌క్ర‌మం లోనే ఆయ‌న‌కు  లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఈ సర్టిఫికెట్ అంద  జేస్తార‌ని ఆ ప్ర‌తినిధులు తెలిపారు. త‌న‌కు ఈ అవార్డు రావ‌డం పై ఎమ్మెల్యే  ఆర్థ‌ర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. క‌రోనా క‌ట్ట‌డి లో తాను చేసిన సేవ‌ల‌ను  జ‌గ‌న్ సైతం కొని యాడారని ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆర్థ‌ర్ కు ప‌లువురు రాజ‌కీయ , స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు అభినంద‌న‌లు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: