ప్రపంచాన్ని దొంగదెబ్బ తీసి తాను పెత్తనం చేద్దామా అనుకున్న చైనా కరోనా వ్యాప్తికి కారణం అయ్యింది. దానితో ప్రారంభం ఆయిన ఈ వైరస్ చాలా త్వరగా ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. దీనితో ప్రపంచం దాదాపుగా స్తంభించిపోయింది. ఏదేశానికి ఆ దేశం అన్ని దారులు మూసేసుకొని హఠాత్తుగా జాగర్తలు పాటించాల్సి వచ్చింది. ఏమి జరుగుతుందో తెలియకుండానే విదేశీయులు వెళ్లగొట్టబడ్డారు. ఇలా ఎన్నో ఘోరాలు, మరణాలతో కొన్నాళ్ళు ఏమి జరుగుతుందో అర్ధం కాకుండానే గడిచిపోయింది. ప్రపంచం ఒకపక్క వణికిపోతున్నప్పటికీ చైనా తన దేశంలో కరోనా అంతం అయినట్టు ప్రకటించుకుంది. ఇదంతా గమనిస్తున్న ప్రపంచ దేశాలు చైనా పై నమ్మకాన్ని వదిలేసుకున్నారు. ఇలా కరోనా దెబ్బతో ఒక వెలుగు వెలిగి ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే దురాశ కలగగానే చైనా ఆశలన్నీ బూడిద లో పోసిన పన్నీరు మాదిరి అయిపోయింది.  

ముందస్తు జాగర్తలతో భారత్ లాంటి అతిపెద్ద జనాభా గల దేశం దాదాపుగా తప్పించుకోగలిగింది. దానిని కూడా సహించలేకపోయింది చైనా. అందుకే భారత్ ను దెబ్బతీయాలని ఈ పరిస్థితులలో కూడా ఆఫ్ఘన్ ఆక్రమణ వెనుక ఉంది కధ నడిపించింది, అంతటితో ఆగలేదు, అది కూడా పెద్దగా విజయవంతం కాలేదనే ఉద్దేశ్యంతో యుద్ధసన్నాహాలు చేయనారంభించింది. అప్పుడే మరోమారు చైనా లో కరోనా విజృంభించాం ప్రారంభం అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. గతంలో కరోనా ప్రారంభమైన వుహాన్ నగరంలో గతం కంటే ఘోరంగా కరోనా వ్యాప్తి ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రధాన నగరాలలో చైనా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించింది.

రష్యా లాంటి దేశాలలో కూడా కరోనా విజృంభిస్తున్నందున ఆయా దేశాల మధ్య దారులు మూసివేయబడ్డాయి. చైనా ఇప్పటికే టీకా పంపిణి చేస్తున్నప్పటికీ ఈ వైరస్ లొంగకపోవడంతో తాజా పరిస్థితులు మాత్రం మరోసారి ఆ దేశంలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందేట్టుగానే ఉన్నాయి. అందుకే ఆయా నగరాలలో లాక్ డౌన్ మళ్ళీ అమలు చేస్తున్నారు. ఇప్పటికే చైనాలో అనేక సంక్షోభాలు విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దానికి తోడుగా ఈ కరోనా కూడా ఇప్పుడే విస్తృతంగా పెరిగిపోతుండటంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: