చిత్రకూట్ గ్యాంగ్ రేప్ కేసులో యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2 లక్షల జరిమానా కూడా విధించారు. గాయత్రీ ప్రజాపతిని లక్నోలోని ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారిస్తూ కొన్ని రోజుల క్రితం కోర్టు తీర్పు వెలువరించింది. అదే సమయంలో సాక్ష్యాధారాలు లేకపోవడంతో 4 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. అతడికి శిక్షను శుక్రవారం కోర్టు ప్రకటించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి, ఆశిష్ శుక్లా, అశోక్ తివారీలకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అదే సమయంలో గాయత్రి ప్రజాపతికి రూ.2 లక్షల జరిమానా విధించారు.ప్రాసిక్యూషన్ ప్రకారం, చిత్రకూట్‌కు చెందిన బాధిత మహిళ ఫిబ్రవరి 18, 2017న లక్నోలోని గౌతమ్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

ఇక మైనింగ్ పనులు ఇప్పిస్తామనే పేరుతో గాయత్రి ప్రజాపతి, ఇతర దోషులు మహిళను లక్నోకు పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. అదే సమయంలో ఆమె మైనర్ కుమార్తెపై కూడా అత్యాచారయత్నం జరిగింది. దీనిపై యూపీ డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశానని, అయితే అక్కడి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆ తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారని ఆ మహిళ ఆరోపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2017 ఫిబ్రవరి 18న గాయత్రీ ప్రజాపతితో పాటు మిగిలిన నిందితులపై లక్నోలోని గౌతమ్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.కేసు నమోదయ్యే సమయంలో ప్రజాపతి యూపీలోని అఖిలేష్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన, కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన ఇళ్లు, స్థలాలపై సీబీఐ దాడులు చేసింది.ఇక నిందితుడికి సరైన శిక్ష పడిందని ఇలాంటోళ్ళకి ఇలానే జరగాలని ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: