కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. దేశంలోనే నెంబర్‌ టూగా చెబుతారు.. కేంద్రంలో మోడీ తర్వాత అంత పవర్ ఫుల్ క్యాండిడేట్‌ అమిత్ షానే.. అలాంటి అమిత్‌ షా ఏపీలో మూడు రోజులు పర్యటించబోతున్నారు. అమిత్ షా ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కు రాబోతున్నారు. ఏపీలో మూడ్రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ రాత్రి 7.40 గం.కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి చేరుకుంటారు. ఈ రాత్రికి తిరుపతి తాజ్‌ హోటల్‌లో అమిత్‌ షా బస చేస్తారు.


కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రేపు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. నెల్లూరు జిల్లా  వెంకటాచలం వెళ్తారు. అక్కడ ఉన్న స్వర్ణభారతి ట్రస్ట్‌, ముప్పవరపు ఫౌండేషన్ల కార్యక్రమాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్థాపించిన స్వర్ణభారతి ట్రస్ట్‌ 20వ వార్షికోత్సవంలో అమిత్‌ షా పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ భేటీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు.


ఈ దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ భేటీలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గోవాల్సి ఉంది. రేపు రాత్రి తిరుపతి తాజ్‌ హోటల్‌లో బస చేయనున్న అమిత్‌ షా.. ఎల్లుండి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఎల్లుండి మధ్యాహ్నం అమిత్‌ షా తిరిగి ఢిల్లీ విమానం ఎక్కేస్తారు. ఇవాళ రాత్రి రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సీఎం జగన్ స్వాగతం పలకబోతున్నారు.


అయితే.. అమిత్‌ షా పర్యటన కారణంగా ఆయనతో సీఎం జగన్ విడిగా భేటీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల పెట్రోల్ , డీజిల్ ధరల తగ్గింపు విషయంలో కేంద్రంపై వైసీపీ నేతలు గట్టిగానే విమర్శలు చేసుకున్నారు. ఏకంగా సీఎం జగన్.. పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి కూడా జగన్ చర్చించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: