తెలంగాణాలో మరోసారి కేసీఆర్ ఫ్రంట్ మాట ఎత్తారు. దీనితో అబ్బాయి(కేటీఆర్) రాష్ట్రంలో చక్రం తిప్పాల్సి ఉంటుంది, తండ్రి కేంద్రాన్ని దించే ప్రయత్నం చేస్తున్న వారితో మంతనాలు జరపాల్సి ఉంటుంది. ఇలా చేయడంలో గతంలో జరిగిన పరిణామాలు చూశాం. అదే స్థాయిలో ఇప్పుడు పరిస్థితులు లేకపోయినా కేసీఆర్ ఫ్రంట్ వైపు చూడటం ద్వారా పరోక్షంగా కేటీఆర్ ను రంగంలోకి దించే యత్నం చేస్తున్నారా అనేది ఆలోచించాలి. మరి కేసీఆర్ మాదిరి కేటీఆర్ రాష్ట్రాన్ని చూసుకోగలడా అనేది కూడా గతంలో గమనించాం. ఈసారి పరిస్థితుల దృష్ట్యా కేటీఆర్ సమర్థవంతంగా ప్రస్తుత ప్రతిపక్షాన్ని నిలువరించగలడా, వాళ్ళ విమర్శలకు సమాధానం చెప్పగలడా అనేది ఇక్కడ ప్రధానాంశం. గతంలో అంటే పెద్దగా ప్రతిపక్షం లేకుండే. ఇప్పుడు  బలంగా బీజేపీ ఉంది. దానికి ధీటుగా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.  

రాష్ట్రాన్ని జాగర్తగా చూసుకునే పరిస్థితి కేటీఆర్ కు ఉంటె, తాజా తెలంగాణ విమోచన దినం రోజున ఆయననే వాళ్ళ నేతగా ఎన్నుకోవాల్సింది, కానీ మళ్ళీ కేసీఆర్ ను తెరాస తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీనిని పరిగణలోకి తీసికుంటే, కేటీఆర్ పై రాష్ట్ర బాధ్యతలు ఇప్పుడే పెట్టడం మంచిది కాదనే అభిప్రాయం కేసీఆర్ కు వచ్చినట్టే కాబట్టి; రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టి బీజేపీ నోట్లోకి ఆయనను తోసేయడనే అభిప్రాయం కూడా వస్తుంది. అందుకే కేంద్రంపై పేరుకు ఫ్రంట్ అంటున్నాడు తప్ప దానికి తగ్గ ఏర్పాట్లు పెద్దగా ఏమి చేయబోవడం లేదు. తెరాస కు కూడా తెలిసి ఉండవచ్చు ఈసారి ఎన్ని చేసినా రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఖాయం అని, కానీ పోరాడటం లేదా తెలంగాణ ప్రాంతీయవాదం మరోసారి తెరపైకి తేవడం ద్వారా సరాసరి మెజారిటీ సీట్లతో బయటపడటానికి ఈ ఎత్తులు వేస్తున్నట్టుగానే ఉంది.  

ఆ అవకాశం బీజేపీ ఇవ్వకుండా వీలైనంత ఎక్కువ మెజారిటీ తో తెలంగాణాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఏమి లేదన్నప్పుడే నాలుగు సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ, ఇంకా ఆగే అవకాశాలు తక్కవే. తెరాస నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. అధికార పార్టీ ఎన్ని పన్నాగాలు వేసినప్పటికీ పరిస్థితిలో మార్పులు రావు. పొరపాటున మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తే, తెరాస పరిస్థితి దయనీయంగా తయారయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి ముందు తెరాస సిద్ధంగా ఉండాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: