ఏపీ సీఎం జ‌గ‌న్ ముందు నుంచి క‌మ్మ సామాజిక వ‌ర్గం విష‌యంలో ఎందుకో పంతానికి పోతున్న‌ట్టే క‌నిపిస్తున్నారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో క‌మ్మోళ్ల‌కు ఇచ్చే ఎమ్మెల్యే సీట్ల‌లో బాగా కోత పెట్టేశారు. వైసీపీ నుంచి కేవ‌లం 6 గురు క‌మ్మ ఎమ్మెల్యేలే ఉన్నారు. వారంతా రాజ‌కీయంగా చాలా జూనియ‌ర్లు. ఒక్క కొడాలి నాని మాత్ర‌మే సీనియ‌ర్‌.. అందుకే త‌న కేబినెట్లో ఆయ‌న కు ఒక్క‌రికి మాత్ర‌మే మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

ఇక వైసీపీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్య‌స‌భ‌కు ఒక్క క‌మ్మ నేత కూడా ఎంపిక కాలేదు. రెడ్ల నుంచి సాయి రెడ్డి - వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి - ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఇలా చాలా మంది రెడ్డి నేత‌లు రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ పుట్టి ప‌దేళ్లు దాటుతున్నా వైసీపీ నుంచి ఒక్క క‌మ్మ ఎమ్మెల్సీ కూడా లేరు. ఎట్ట‌కేల‌కు ఈ సారి రెండు క‌మ్మ ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా వాళ్లు ప్ర‌జ‌ల్లో నుంచి వ‌చ్చిన నేత‌లు కానే కాదు.

కృష్ణా జిల్లాలో త‌ల‌శిల ర‌ఘు, ప్ర‌కాశం జిల్లా నుంచి తూమాటి మాధ‌వ రావుల‌కు జ‌గ‌న్ ఎమ్మెల్సీ లు ఇచ్చారు. అయితే కీల‌కమైన గుంటూరు జిల్లాలో క‌మ్మ వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కు ఎమ్మెల్సీ , మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పి కూడా జ‌గ‌న్ ఇవ్వ‌లేదు. దీంతో గుంటూరు క‌మ్మ‌ల్లో జ‌గ‌న్ తో పాటు వైసీపీ పై తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ వుతున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో జిల్లా లో టీడీపీ నుంచి పోటీ చేసిన అంద‌రు క‌మ్మ‌ల‌ను ( ఒక్క జ‌య‌దేవ్ త‌ప్పా) ఓడించామ‌ని.. వైసీపీ నుంచి పోటీ చేసిన అంద‌రు క‌మ్మ ల‌ను గెలిపించామ‌ని.. కానీ జ‌గ‌న్ త‌మ వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు.. ఇక ఎమ్మెల్సీ ఇస్తాన‌ని కూడా మాట ఇచ్చి ఇవ్వ‌లేద‌ని వారు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ ఎఫెక్ట్ 2024 ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా ప‌డ‌నుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: