ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ పాలన మొదలు పెట్టిన తర్వాత జరుగుతున్న అరాచకాలు మాటల్లో చెప్పలేనిది. అడుగడుగునా ప్రజలందరినీ చిత్రహింసలకు గురి చేస్తూ మహిళలనూ కేవలం సెక్స్ వర్కర్లుగా  మాత్రమే భావిస్తూ అందరినీ బానిసలుగా చూస్తున్నారు. షరియా చట్టాలను అమలు లోకి తీసుకువచ్చి దారుణమైన పాలన కొనసాగిస్తున్నారు.  ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆహార సంక్షోభం ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. కానీ ప్రజల సంక్షేమాన్ని వదిలేసి రాక్షస పాలన కొనసాగిస్తున్నారు తాలిబన్లు. ఈ క్రమంలోనే తాలిబన్లు పాలన తో ఆఫ్ఘనిస్తాన్  ప్రజలందరూ  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో అటు ఒక్క నిమిషంలో ఐఎస్ఐఎస్ఐ తీవ్రవాదుల సృష్టిస్తున్న విధ్వంసంతో మాత్రం ప్రజలందరూ మరింత ప్రాణభయం పెంచేస్తున్నాయి.



 తాము తాలిబన్లకు వ్యతిరేక అంటూ చెబుతున్న ఐఎస్ఐస్ఐ తీవ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్లో వరుసగా బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నారు. అంతే కాదు తాలిబన్లకు సవాలు విసురుతూ ఉండడం గమనార్హం. తాలిబన్లు ఉన్నారు అంటూ కారణం చెబుతూ ఇప్పటికే ఎన్నో ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళకు పాల్పడ్డారు తీవ్రవాదులు. దీంతో ఏ క్షణంలో ఎక్కడ బాంబు దాడి జరుగుతుందో అని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇలా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాలిబన్లు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.



ఈ బాంబు పేలుళ్లలో తాలిబాన్లు చనిపోవడం ఏమో కానీ ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరోసారి ఆఫ్ఘనిస్థాన్లో ఐఎస్ ఐఎస్ కే తీవ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇప్పటికే వరుసగా శుక్రవారం శుక్రవారం పేలుళ్ళు సంభవిస్తా ఉండగా ఇటీవల శనివారం కూడా పేలుళ్లు సంభవించటం సంచలనంగా మారింది. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో తాలిబన్లు చెక్పోస్టు సైడ్ నుంచి వెళ్తున్న ఒక మినీ బస్సును టార్గెట్ చేస్తూ బాంబు దాడికి పాల్పడ్డారు ఇక ఈ బాంబు దాడిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరో ఆరుగురు తీవ్రంగా గాయ పడినట్లు తెలుస్తుంది. అయితే తాలిబన్లు ఉన్నారు అన్న కారణంతోనే బాంబు దాడికి పాల్పడినట్లు ఐఎస్ఐఎస్కే తీవ్రవాదుల ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: