తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముగియగా.. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజనకు సంబంధించి నెలలో కార్యచరణ సిద్ధం చేయాలని అమిత్ షా అధికారులను ఆదేశించారు. అటు ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు స్థలం మార్పును నోటిఫికేషన్ ద్వారా ప్రకటించాలని జగన్ విజ్ఞప్తి చేయగా.. షా అంగీకరించారు. అలాగే గ్రేహౌండ్స్, ట్రైనింగ్ సెంటర ఏర్పాటు అంశాన్ని జగన్ ప్రస్తావించగా.. భూమిని ఇస్తే.. ఖర్చును భరిస్తామని షా చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ప్రసంగించిన అమిత్ షా.. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న అంశాలు కేవలం రెండు రాష్ట్రాలకు చెందినవే కాదని.. జాతీయ అంశాలని చెప్పారు. సీఎం జగన్ ప్రస్తావించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. వీటన్నింటినీ తప్పనిసరిగా పరిష్కరిస్తామన్నారు.

తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలని దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వాలి. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై కోతలు విధిస్తున్నారు. రుణాలపై కోతల అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రేషన్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత లేదు అని సీఎం అన్నారు.

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీలో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలి. ఇందుకు ప్రత్యేక కమిటీ వేయాలి. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిది. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదు. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. పోలవలం ఖర్చుపై విభజన చట్టాన్ని ఉల్లంఘించారు. ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేర్చలేదు అని జగన్ అన్నారు. మొత్తానికి సీఎం జగన్.. అమిత్ షా మధ్య స్నేహబంధం వెల్లివిరిసిందని తెలస్తోంది. చూద్దాం ఏపీకి కేంద్రం నుంచి అంతా మంచే జరగాలని కోరుకుందాం.


 









మరింత సమాచారం తెలుసుకోండి: